Begin typing your search above and press return to search.
ఇంతటి ధైర్యం జగన్ కు మాత్రమే సాధ్యం
By: Tupaki Desk | 26 Oct 2018 6:48 AM GMTనవ్వుతూ వచ్చి.. సెల్ఫీ దిగుతానని చెప్పి.. ఆ వంకతో పదునైన కత్తితో దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఎంత షాకింగ్ గా ఉంటుంది? పొడిచిన కత్తికి విషం పూసి ఉంటే?. ఇలాంటి అనుమానాలు.. భయాందోళనలు క్షణాల్లో ముసురుకోవటం ఖాయం. అలాంటి వేళ.. ఏ స్థాయి వ్యక్తులైనా స్థిమితంగా ఉండలేరు. మామూలుగా ఉండటం సాధ్యం కాదు.
కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. విపత్తు వేళ ఎంత ధైర్యంగా ఉంటారో.. ఎంత నిబ్బరంగా ఉంటారన్న దాని మీదనే సదరు వ్యక్తి సామర్థ్యం ఎంతన్నది తెలుస్తుంది. తాజాగా తనపై జరిగి హత్యాయత్నం వేళలోనూ బ్యాలెన్స్ మిస్ కాకపోవటం.. తన టెంపర్ మెంట్స్ ను కోల్పోకపోవటం లాంటివి చూస్తే.. ఇలాంటివి జగన్ కు మాత్రమే సాధ్యమవుతుంది.
తనపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని ఏమీ చేయొద్దన్న మాటతో పాటు.. చెరగని చిరునవ్వు.. తనకు ఏమైందన్న ఆందోళనతో హడావుడి పడుతున్న వారి అదుర్దాను తగ్గించేలా.. నాకేం కాలేదు.. మీరు అనవసరంగా కంగారు పడొద్దంటూ చెబుతూ.. ఎవరిని రెచ్చగొట్టకుండా జగన్ వ్యవహరించిన తీరు ఇయనకు సరికొత్త ఇమేజ్ తెచ్చి పెట్టేలా మారింది.
సాధారణంగా అసాధారణ సంఘటన జరిగినప్పుడు దాన్ని రాజకీయం చేసి.. వీలైనంత మైలేజ్ పొందాలనుకోవటం కామన్. కానీ.. దాని కారణంగా సానుభూతి రావొచ్చు కానీ.. శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయాన్ని గుర్తించిన జగన్.. ఎక్కడా తొందరపడకుండా.. భావోద్వేగాలకు గురి కాకుండా.. అదుర్దా పడుతున్న వారికి ఏమీ కాదన్న భరోసా ఇస్తూ.. ఎప్పటిలానే నవ్వుతూ.. చేతులు నమస్కరిస్తూ ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళ్లిన వైనాన్ని ఇప్పటికీ పలువురు మర్చిపోలేకపోతున్నారు. చేతికి గాయమైనా.. ఆ నొప్పిని ముఖంలో చూపించని జగన్ ఆత్మస్థైర్యానికి హేట్సాఫ్ అని చెప్పక తప్పదు.