Begin typing your search above and press return to search.
మంత్రిపదవిపై భూమాను బాబు ఎలా మోసగించారంటే..
By: Tupaki Desk | 14 March 2017 9:26 AM GMTభూమా నాగిరెడ్డి మృతి తరువాత అసెంబ్లీలో టీడీపీ సంతాప తీర్మానం ప్రవేశ పెట్టడం.. దానికి వైసీపీ గైర్హాజరు కావడం వివాదం కావడం తెలిసిందే. జగన్ అసెంబ్లీలోని తన గదిలోనే ఉన్నా భూమాపై సంతాప తీర్మానం పెట్టినప్పుడు రాలేదని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మీడియా సమావేశం పెట్టి అసలు సంగతి చెప్పారు. భూమా హుందాతనం కాపాడడం కోసమే తాను సభలోకి రాలేదని... తాను వచ్చి మాట్లాడితే భూమా పార్టీ మారిన విషయం, అందుకు దారితీసిన కారణాలు.. చంద్రబాబు చేసిన మోసం వంటివన్నీ అక్కడే చెప్పాల్సి ఉంటుందని.. భూమాకు సంతాపం తెలుపుతున్న సమయంలో అవన్నీ మాట్లాడడం ఇష్టంలేకే రాలేదని చెప్పారు. చంద్రబాబు భూమాను ఎలా మోసగించారో కూడా జగన్ చెప్పారు.
మూడు రోజుల్లో మంత్రిని చేస్తానని మభ్యపెట్టి భూమాను వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకెళ్లారని.. ఆ తరువాత పదవి ఇవ్వలేదు సరికదా మానసికంగా క్షోభ పెట్టారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభ కారణంగానే భూమా నాగిరెడ్డి చనిపోయారని జగన్ వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఆశ చూపడం వల్లే భూమా నాగిరెడ్డి పార్టీ మారారని చెప్పారు. పార్టీ మారవద్దని వైవీసుబ్బారెడ్డి సూచించినా మూడు రోజుల్లోనే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని భూమా నాగిరెడ్డి చెప్పారన్నారు.
భూమా నాగిరెడ్డి హుందాతనం కాపాడేందుకే తాను సభకు వెళ్లలేదని చెప్పారు. సంతాప తీర్మానంలో పాల్గొంటే పార్టీ మారిన విషయాన్ని కూడా ప్రస్తావించాల్సి ఉంటుందని… కానీ చనిపోయిన వ్యక్తిపై చెడుగా మాట్లాడడం ఇష్టం లేకే సభకు వెళ్లలేదన్నారు. భూమా మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. భూమా నాగిరెడ్డి చనిపోయారని తెలియగానే తాను, తన తల్లి ఫోన్ చేసి నేరుగా అఖిలప్రియతో మాట్లాడామని గుర్తు చేశారు. తండ్రి చనిపోయి 24 గంటలు కూడా గడవకముందే భూమా అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌ను చివరి దశలో ఎలా మానసికంగా హింసించారో భూమా నాగిరెడ్డిని కూడా చంద్రబాబు అలాగే హింసించి మరణానికి కారణమయ్యారని మండిపడ్డారు. తాను గతంలో పార్టీ స్థాపించినప్పుడు తన వెంట వచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకున్నానని జగన్ చెప్పారు. ఈ రోజు చంద్రబాబు మాత్రం ఫిరాయించిన ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీలో ప్రసంగాలు ఇప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు తనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని జగన్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం భూమా నాగిరెడ్డి మరణించారు కాబట్టి ఆయనపై అనవసర వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. నంద్యాల ఉప ఎన్నికపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని జగన్ వ్యాఖ్యానించారు. భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి వైసీపీ తరపునే గెలిచారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/