Begin typing your search above and press return to search.
అంతా చంద్రబాబే చేశాడు- జగన్
By: Tupaki Desk | 1 Feb 2016 9:26 AM GMTతుని ఘటనకు సంబంధించి కుట్ర చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబేనని వైకాపా అధినేత జగన్ ఆరోపించాడు. కాపుల సభ విజయవంతమైతే ముద్రగడ పద్మనాభంకు, ప్రతిపక్ష పార్టీలకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే కుట్ర పూరితంగా చంద్రబాబు గొడవలు రేపాడని జగన్ అన్నాడు.
‘‘తుని సభకు సంబంధించి నాలుగు నెలల ముందే డేటు ఇచ్చారు. ఐతే ఆ సభ జరగకుండా చేయడానికి చేయాల్సిన కుట్రలన్నీ చంద్రబాబు చేశాడు. తన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ సభకు రాకుండా చేశాడు. అందరినీ హైదరాబాద్ కు పిలిపించుకున్నాడు. అవసరమైనన్ని బస్సులు ఇవ్వలేదు. రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. 8 కిలోమీటర్ల దూరంలోనే బస్సులన్నీ ఆపేసి సభ విజయవంతంకాకుండా చేయాలని చూశాడు. అందరినీ ఫ్రస్టేషన్ కు గురి చేశాడు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన తర్వాత కూడా ఆ మీటింగ్ సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో ఉద్యమకారులకు, ప్రతిపక్ష పార్టీలకు మంచి పేరు వస్తుందన్న బాధతో ఇదంతా చేశాడు.
అసలు సభలో ఏం జరిగిందో అందరూ చూశారు. ముద్రగడ పద్మనాభం గారు పదిహేను నిమిషాలు మాట్లాడారు. రైల్ రోకో చేద్దామన్నాడు. అందరినీ కలిసి తీసుకెళ్లాడు. మీడియా వాళ్లందరూ కూడా ఆయనతో పాటు వెళ్లారు. కానీ అక్కడ కుట్ర పూరితంగా ఏదో చేశారు. కానీ చంద్రబాబు ఆరు ఛానెళ్లకు మాత్రం ప్రత్యేకంగా ఏదో తెలిసిందని ఆరోపిస్తాడు. ఇదంతా కాపులకు సంబంధించి మీడియాలో చర్చ జరగకుండా చూడాలని చేసిన కుట్ర. రేప్పొద్దున ఎవరైనా కవర్ చేసినా.. వాళ్ల మీద ఓ ముద్ర వేయడం కోసం.. ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఇలా చేశారు. మీటింగులో బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. కానీ ఆయన పేరెత్తలేదు చంద్రబాబు. ఎందుకంటే ఆయన పేరెత్తితే బీజేపీ వాళ్లు చంపేస్తారు’’ అని జగన్ అన్నాడు.