Begin typing your search above and press return to search.
ఎయిర్ లిఫ్ట్: గుజరాత్ నుంచి విశాఖకు కెమికల్స్
By: Tupaki Desk | 7 May 2020 12:30 PM GMTవిశాఖపట్నంలో ఈ ఉదయం సంభవించిన గ్యాస్ లీక్ కారణంగా విడుదలైన విష వాయువులను నియంత్రించడానికి గుజరాత్ నుంచి ఏపీకి దాని విరుగుడు కెమికల్స్ ను తెప్పిస్తున్నారు. విశాఖలో లీక్ అయిన ‘స్టెరిన్ గ్యాస్’కు విరుగుడు కెమికల్స్ కేవలం గుజరాత్ లోనే ఉన్నాయి. రసాయన పరిశ్రమలకు కేంద్రంగా గుజరాత్ ఉంది. దీంతో ఏపీ సీఎం జగన్ తాజాగా గుజరాత్ సీఎం విజయ్ రూపాణితో ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. దీంతో ఆ విరుగుడు కెమికల్స్ ఏపీకి విమానంలో వస్తున్నాయి. ఈ విషయంలో వైసీపీ రాజ్యసభ అభ్యర్థి, అపర కుబేరుడు అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీ కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది.
విశాఖలో లీక్ అయిన విష వాయువుల ప్రభావాన్ని తగ్గించడానికి ‘పారా టెరిటియరీ బ్యూటిల్ క్యాట్ థాల్ (పీటీబీసీ)’ కెమికల్స్ ఉపయోగించాలని గ్యాస్ లీక్ అయిన ఎల్.జీ కంపెనీ శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి సూచించారు. అవి గుజరాత్ లో మాత్రమే తయారవుతున్నాయి. దీంతో వాటిని అక్కడి నుంచి ఏపీకి తెప్పిస్తున్నారు.
విజయ్ రుపాణీ చొరవ తీసుకొని గుజరాత్ సీఎం కార్యదర్శితో మాట్లాడి వాపి పారిశ్రామిక వాడలో గల రసాయనాల పరిశ్రమల నుంచి 500 కేజీల ‘పారా టెరిటియరీ బ్యూటిల్ క్యాట్ థాల్ కెమికల్ ను రోడ్డు మార్గంలో డామన్ కు తరలించారు. అక్కడి నుంచి విమానంలో ఈ రసాయనాన్ని విశాఖపట్నంకు తరలిస్తున్నారు. విషవాయువులు ప్రభావం ఉన్న ప్రాంతంలో వీటిని వెదజల్లుతారు. ఎలాంటి విషవాయువులను అయినా ఈ కెమికల్ నియంత్రిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
అంతేకాకుండా హెలిక్యాప్టర్ ద్వారా సముద్రపు నీటిని తీసుకొచ్చి గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో చల్లుతున్నారు. ఉప్పు నీరు వల్ల కూడా విషవాయువుల తీవ్రత తగ్గుతుంది. ఈ రెండింటితో గ్యాస్ తీవ్రత తగ్గుముఖం పట్టనుంది.