Begin typing your search above and press return to search.
‘ఇసుక’ తుఫాన్ కు జగన్ చెక్!
By: Tupaki Desk | 6 Nov 2020 5:10 PM GMTఏపీలో ఇప్పుడు అందరి అవసరం ఇసుక. అందరూ కోరుకునేది ఇసుక. గత చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడితనంతో దోపిడీకి గురైన ఇసుకను జగన్ వచ్చాక కంట్రోల్ చేశాడు. కట్టడి చేశాడు. టీడీపీ నేతల చేతుల్లో ఉన్న ఇసుక రీచులను ప్రజలకు చేరువ చేశాడన్న ధీమాను కల్పించారు.
టీడీపీ హయాంలో ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు తనని తానే ప్రజల ముందు విలన్ చేసుకున్నాడు. ఈ విషయాలు తన దృష్టికి వచ్చినా చంద్రబాబు చూసీ చూడనట్లు వదిలేశారు తప్ప ఏ చర్యలకూ దిగలేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ఇసుక తుఫానే బాబుని ఎగరేసుకుపోవాల్సి వచ్చింది. అయితే ఈ విషయంలో మొదట్లో కాస్త విమర్శలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు జగన్ తేరుకున్నారు. జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా ఏపీలో కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చారు.
నాటి పరిస్థితులను బేరీజు వేసుకున్న జగన్.. ఇప్పుడు ఇసుక పాలసీలో దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇకనుంచి రీచ్ నుంచి స్టాక్ పాయింట్‌కు.. అక్కడి నుంచి ప్రజలకు రవాణా చేసే క్లిష్టతరమైన విధానానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించారట. అంతేకాదు.. టన్ను ఇసుక రూ.475కు మించకూడదనే గొప్ప నిర్ణయం కూడా చేశారు. మరోవైపు.. ఆఫ్‌లైన్‌లోనే ఇసుక పొందే అవకాశం కల్పిస్తోంది.
ఇక పారదర్శకత విషయానికొతే రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించడం.. ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రానిపక్షంలో.. 13 జిల్లాలను మూడు భాగాలుగా విభజించి టెండర్లు నిర్వహించాలని నిర్ణయించారు. జగన్ నిర్ణయంతో రాష్ట్రమంతటా పాజిటివ్ వాతావరణమే కనిపిస్తోంది. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.