Begin typing your search above and press return to search.

జగన్ ఎమెర్జెన్సీ మీటింగ్.. బాబుకు షాక్..

By:  Tupaki Desk   |   2 April 2019 4:23 AM GMT
జగన్ ఎమెర్జెన్సీ మీటింగ్.. బాబుకు షాక్..
X
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యంగా వదిలేయవద్దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా పోల్ మేనేజ్ మెంట్ లో ఆరితేరిన చంద్రబాబు గడిచిన 2014 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో తన తెలివితేటలు సీనియార్టీని ఉపయోగించి పోల్ మేనేజ్ మెంట్ తో 2వేలు - 1000 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. అందుకే ఈసారి జగన్ ఆ పొరపాట్లకు తావు ఇవ్వవద్దని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇప్పుడు ప్లాన్ బి అమలు చేస్తున్నారు. తన ప్రచారానికి మంగళవారం ఫుల్ స్టాప్ పెట్టారు. పోలింగ్ కు కేవలం 9 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆయన సీనియర్ పార్టీ నేతలు - రాజకీయ నిపుణులతో ఈరోజు పోల్ మేనేజ్ మెంట్ పై అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

ఇందుకోసం ఇప్పటికే వైసీపీ జిల్లా పార్టీ నేతలు - అభ్యర్థులను రెడీగా ఉండమన్నారు. ఈరోజు వైఎస్ జగన్ వారితో నేడుగా మాట్లాడనున్నారు.

దాదాపు మూడు సంవత్సరాలు పాదయాత్ర చేసిన జగన్.. అభ్యర్థులను ప్రకటించాక.. పదిరోజులుగా జిల్లాల పర్యటనలో బిజీ బిజీగా గడుపుతూ ప్రచారం చేస్తున్నారు. దీంతో పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించలేదు. అధికార టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇప్పటికే ఉదయం - సాయంత్రం పోల్ మేనేజ్ మెంట్ పై టెలీ కాన్ఫరెన్స్ లతో టీడీపీ అభ్యర్థులను అలెర్ట్ చేస్తున్నారు. దీంతో జగన్ అత్యవసర సమావేశం పెట్టి జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి - పోల్ మేనేజ్ మెంట్ పై మంగళవారం సమీక్షించనున్నారు.

ఇక రేపు యథావిధిగా ప్రచారా కార్యక్రమాలు ఉంటాయని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇకపై బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపుపై పోల్ మేనేజ్ మెంట్ పై ఖాళీ సమయాల్లో సమీక్షించాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం.