Begin typing your search above and press return to search.
బాబుకు జగన్ ఆఫర్..కలిసి పోరాటం చేద్దాం
By: Tupaki Desk | 15 Feb 2018 1:56 PM GMTప్రత్యేక హోదాపై పట్టువదలని విక్రమార్కుడులా ఒకేమాటపై ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్. గత ఎన్నికల నుంచి కేంద్రం ఎన్ని మాటలు చెబుతున్నా - ప్యాకేజీలంటున్నా వాటినేమీ జగన్ లెక్కలోకి తీసుకోవడం లేదు. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి. అది లేకపోతే ఏపీ బతికిబట్టకట్టడం కష్టం అని జగన్ మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు. ఆ దిశగా ఇప్పటికే అనేక పోరాటాలు దీక్షలు చేసిన జగన్ చివరకు తమ పార్టీ పదవులను త్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు. కేంద్ర బడ్జెట్ తో మొదలైన రాజకీయాల వేడి...ఏపీలో మరింత హీటెక్కుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు తమదైన శైలిలో సవాళ్లు - ప్రతిసవాళ్లు విసురుకుంటుండటంతో మరింత క్రేజ్ ను కలిగిస్తోంది. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా కోసం నిర్వహించే మా పోరాటంలో టీడీపీ మాతో కలిసి రావాలని వైసీపీ అధినేత - ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుకు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణమాలలో నిర్వహించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ హోదా కోసం 25మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. ఎంపీలు రాజీనామా చేస్తే హోదా రాకుండా ఎక్కడికి పోతుందో చూద్దామని జగన్ అన్నారు.
వైఎస్ ఆర్ సీపీ కి చెందిన ప్రతి ఒక్కరూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద మార్చి 1న ధర్నా నిర్వహిస్తారని వైఎస్ జగన్ చెప్పారు. మార్చి 3న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు - ఎంపీలు - సీనియర్లు పాదయాత్ర జరుగుతున్న ప్రదేశానికి వస్తారని, అక్కడి నుంచి తాను వారందరినీ జెండా ఊపి ఢిల్లీకి పంపుతానని వివరించారు. మార్చి 5 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో హోదా కోసం పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారని చెప్పారు. ఏప్రిల్ 6 వరకూ(బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి) పోరాటం చేసినా ఫలితం లేకపోతే పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని తెలిపారు. ప్యాకేజితో సరిపెడామనుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల ప్రత్యేక హోదాపై మన ఆరాటాన్ని కేంద్రానికి స్పష్టంగా చెప్పొచ్చని అన్నారు.
ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కరించకపోవడంతో ఆయన పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని జగన్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం చంద్రబాబునాయుడు నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. మన ప్రభుత్వం వచ్చాక వృద్దులకు రూ.2వేల పెన్షన్ ఇస్తామన్నారు. నవరత్నాలను అమలు చేస్తామన్నారు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ వయసు 45ఏళ్లకు తగ్గిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మద్యం మీద మూడు దశలుగా యుద్దం ప్రకటిస్తామన్నారు.