Begin typing your search above and press return to search.
జగన్ నిబద్ధతకు నిదర్శనం ఇదే!
By: Tupaki Desk | 8 Jun 2019 9:17 AM GMTనవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పది రోజుల క్రితమే పదవీ ప్రమాణం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... నేటి ఉదయం లాంఛనంగా పని ప్రారంభించేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో కాలు పెట్టేందుకు ముహూర్తం చూసుకుని మరీ నేటి ఉదయం సరిగ్గా 8.39 గంటలకు తన చాంబర్ లో జగన్ అడుగు పెట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్ఛారణ చేసి జగన్ కు ఆశీర్వాదం పలికారు. సీఎం సీటులో జగన్ కూర్చున్న ఈ అరుదైన ఘట్టానికి పార్టీలోని కీలక నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు ఆయన చాంబర్ లోకి అడుగుపెట్టిన మీడియా ప్రతినిధులకు అక్కడ ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి.
జగన్ చాంబర్ లోని గోడల నిండా ఆయన ప్రకటించిన నవరత్నాలకు చెందిన చిత్రాలే దర్శనమిచ్చాయి. మొత్తం నవరత్నాల్లోని తొమ్మిది పథకాలకు సంబంధించిన చిత్రాలను కాస్తంత పెద్దగా చేయించుకున్న జగన్... వాటిని తన చాంబర్ గోడలకు అంటించుకున్నారు. ఆ పక్కనే తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు చిత్రాన్ని కూడా అంటించుకున్నారు. మొత్తంగా జగన్ చాంబర్ లో నవరత్నాలకు చెందిన చిత్రాలు, వైఎస్ చిత్రపటం ఉండటం నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది. నవరత్నాలను పక్కాగా అమలు చేసి తన తండ్రి ప్రారంభించిన సంక్షేమ పాలనను కొనసాగిస్తానని చెప్పిన జగన్... ఇప్పుడు వాటిని తన చాంబర్ గోడలకు అంటించేసుకుని.... నిత్యం అవి తనకు గుర్తుకు వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది.
జగన్ లో కనిపిస్తున్న ఈ కొత్త తరహా వైఖరిని చూస్తుంటే... రానున్న కాలంలో నవరత్నాలు పక్కాగానే అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. జనానికి తానిచ్చిన హామీలు ప్రతిక్షణం తనకు గుర్తుకు వచ్చేలానే జగన్ ఈ ఏర్పాటును చేసుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక మాట తప్పని - మడమ తిప్పని నేతగా జగన్ తనను తాను అభివర్ణించుకున్న వైనాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్న జగన్ ఫ్యాన్స్... తమ అభిమాన నేత నిబద్ధతకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా జగన్ తన చాంబర్ గోడలను నవతర్నాలను నింపేసుకున్న వైనం నిజంగానే ఆసక్తికరమని చెప్పక తప్పదు.