Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీ - యార్లగడ్డలకు సంధి కుదిర్చిన జగన్

By:  Tupaki Desk   |   8 Oct 2020 1:30 PM GMT
వల్లభనేని వంశీ - యార్లగడ్డలకు సంధి కుదిర్చిన జగన్
X
కొద్దిరోజులుగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సెగలు పొగలు రగులుకుంటున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి రావడంతో అప్పటికే వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావ్ సహా మరో నేత దుట్టా రాంచంద్రరావు , మిగతా వైసీపీ నేతలు వంశీని వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే మూడు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వర్గపోరు నడుస్తోంది. ఇది వైసీపీకే ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

ఈ క్రమంలోనే గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పునాదిపాడులో ఇవాళ సీఎం జగన్ పర్యటించి ‘జగనన్న విద్యాదీవెన’ పథకాన్నిప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వల్లభనేని వంశీ, ఆయన ప్రత్యర్థి, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ ఇద్దరిని సీఎం జగన్ కలిపేందుకు ప్రయత్నించారు.

సీఎం జగన్ కు యార్లగడ్డ వెంకట్రావ్ అభివాదం చేస్తున్న సమయంలో పక్కనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నాడు. ఇది గమనించిన జగన్.. యార్లగడ్డ వెంకట్రావ్ చేతిని పక్కనే ఉన్న వంశీ చేతిలో వేశారు. కలిసి పనిచేయాలని సూచించారు.

ఈ సమయంలో యార్లగడ్డ ఏదో చెప్పబోతుండగా.. జగన్ ఆ మాటలను వినకుండా ఆయన కడుపును అప్యాయంగా పట్టుకొని కలిసి పనిచేయాలని సూచించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ తంతంగాన్ని పక్కనే ఉన్న వంశీ చూస్తూ ఉండిపోయాడు. కార్యకర్తలు మాత్రం ఈ ఇద్దరు నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ఊరట చెందారు. ఇక విభేదాలు ముగిసినట్టేనా అని సంబరపడ్డారు.

మరి జగన్ సూచనతోనైనా చేతులు కలిపిన వంశీ-యార్లగడ్డి దాన్ని కొనసాగిస్తారా? లేదా కేవలం ఇదంతా ఇప్పటి వరకేనా అన్నది వేచిచూడాలి.