Begin typing your search above and press return to search.

జగన్ కలిపిన బంధం ఈనాటిది కాదు..

By:  Tupaki Desk   |   31 May 2019 5:30 PM GMT
జగన్ కలిపిన బంధం ఈనాటిది కాదు..
X
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం.. అందులో ఆంధ్ర, తమిళనాడు కలిసి ఉండేవి. ఒకప్పుడు మన టాలీవుడ్ మద్రాస్ లోనే ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు తమిళనాడులోనే తెలుగు సినిమాలు తీసేవారు. మద్రాస్ స్టేట్ తో ఏపీ ప్రజలకు ఉన్న అనుబంధం అంతా ఇంతాకాదు. దశాబ్ధాలుగా మద్రాస్ రాష్ట్రంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రాలు కలిసి ఉన్నాయి.

అయితే 1953 అక్టోబర్ 1న మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటైంది. కర్నూలు రాజధానిగా ఇప్పటి ఏపీ ఏర్పడింది. ఆ తర్వాత 3 ఏళ్లకే నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. అయితే తమను ఆంధ్రాలో కలుపవద్దని నాటి నుంచి మొన్నటి 2014 వరకు దశలవారీగా ఉద్యమం సాగింది. చివరకు కేసీఆర్ , ప్రజాసంఘాల పోరాటం ఫలించి ఏపీని విడగొట్టి తెలంగాణ ఏర్పాటు చేశారు.

నాటి ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి నేటి తెలంగాణ, ఏపీ దాకా దశాబ్ధాలుగా తెలుగువారు, తమిళులు కలిసే ప్రయాణం సాగించారు. నాటి జ్ఞాపకాలు చరిత్ర జగన్ ప్రమాణ స్వీకార వేదిక గుర్తు చేసిందని నాటి నేతలు చర్చించుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, తమిళనాడు కాబోయే సీఎం కలిసి నడవడం ఆహుతులను ఆకట్టుకుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, డీఎంకే అధినేత స్టాలిన్ ముగ్గురు ఒకే వేదిక మీద మూడు రాష్ట్రాల ఐక్యతను చాటిచెప్పిన వేళ ఒక్కసారి చరిత్రను జగన్ కళ్లముందు ఉంచడం ప్రజలను ఆకర్షించింది. ఇలా దక్షిణాది మూడు రాష్ట్రాలు ఒకే మాట.. ఒకే బాట మీద ఉంటే కేంద్రంలో కూడా మన హక్కులు సాధించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.