Begin typing your search above and press return to search.
ఏందేది జగనా? మోడీ అపాయింట్ మెంట్ తీసుకొని ‘బటన్’ నొక్కమని చెబుతారా?
By: Tupaki Desk | 28 July 2022 3:51 AM GMTఇప్పుడు మేం చెప్పే మాటలు ఏవీ కూడా.. మా సొంతంగానో.. లేదంటే ఎక్కడో చూసిందో.. రాసిందో చదివి చెప్పట్లేదు. నేరుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటల్ని యథాతధంగా చెప్పేస్తున్నాం. ఇదంతా చదివిన తర్వాత ఒక్కసారి అవాక్కు కావటం.. ఆ పైన షాక్ నుంచి బయటకు రావటం కాస్త ఆలస్యం అవుతుందని చెప్పక తప్పదు. ఏమైనా.. ఇలాంటి మాటలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి మాత్రమే వస్తాయని చెప్పక తప్పదు.
ఏపీలో అనూహ్యంగా కురిసిన వర్షాలు.. వరదల కారణంగా ఏలూరు.. అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు మండలాల్లోని వేలాది మంది పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటం తెలిసిందే. తాజాగా విరుచుకుపడిన విపత్తు.. గతానికి భిన్నమని చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఏకంగా 20 రోజుల పాటు నీళ్లు నిలిచి ఉండటం.. అది కూడా మొదటి ప్రమాద ఘంటిక మీదనే కావటం అరుదైన విషయంగా చెప్పక తప్పదు.
వరదల కారణంగా దారుణంగా దెబ్బ తిన్న బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..తన రాక ఆలస్యానికి కారణం సూటిగా చెప్పలేదు కానీ.. తన పాలనలో ఎదురైన విపత్తును ప్రభుత్వం ఎదుర్కొన్న విధాన్ని చెప్పే ప్రయత్నం చేశారని చెప్పాలి. ఇంతవరకు బాగానే ఉన్నా.. సీఎం పర్యటనలో బాధితులకు భారీ ఎత్తున ఊరట లభించే ప్రకటనలు వస్తాయని ఆశించిన వారికి దిమ్మ తిరిగేలా వ్యాఖ్యలు చేయటం విశేషం.
బాధితులకు అందించే పరిహారం కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందని అందరూ అనుకుంటే.. అందుకు భిన్నంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు విన్నాక ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఇంతకీ సీఎం జగన్ నోటి నుంచి వచ్చిన అమూల్యమైన మాటల్ని ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘ప్రధాన మంత్రి మోదీ అపాయింట్‌మెంట్ అడిగా. నేను చూసిన పరిస్థితులన్నింటినీ ఆయనకు వివరిస్తా.
1986లో ఇంత స్థాయి నీరు వచ్చిందని, మళ్లీ 36 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో నీళ్లు వచ్చాయని చెబుతా. ఇది జాతీయ ప్రాజెక్టు. అందువల్ల ఏ రోజైనా పరిహారం ఇవ్వక తప్పదు కదా సర్.. ఇచ్చేదేదో ఇప్పుడే ఇస్తే.. వారంతా సంతోషిస్తారు. నిర్వాసితులు మిమ్మల్నే తలుచుకుంటారు.. లేదంటే తిట్టుకుంటారు.. బటన్ నొక్కి డీబీటీ ద్వారా నేరుగా నిర్వాసితుల ఖాతాల్లోకి మీరే డబ్బు పంపండి అని ప్రధాన మంత్రిని కోరుతా’’ అని వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి మోడీతో.. ఆయన ఎదురుగా ఉండి.. ‘ఇచ్చేదేదో ఇప్పుడే ఇస్తే.. వారంతా సంతోషిస్తారు. నిర్వాసితులు మిమ్మల్నే తలుచుకుంటారు. లేదంటే తిట్టుకుంటారు’ లాంటి మాటలు చెప్పటం సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్న. అంతేకాదు.. బటన్ నొక్కి బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి పరిహారాన్ని వేయాలని అడుగుతానంటూ చెప్పిన మాటల్ని వింటే.. బటన్ నొక్కి సాయం అందించే ప్రక్రియ ఏపీ సీఎంకు అలవాటుగా మారిందేమో కానీ.. ప్రధానికి అవుతుందని చెప్పలేం. ఈ తరహా మాటలకు ప్రధాని మోడీ స్పందిస్తారా? అందునా.. ఏపీ విషయంలో అన్నది అసలు ప్రశ్న. ఏమైనా.. సీఎం జగన్ వ్యాఖ్యల్ని చూసినప్పుడు మాత్రం విస్మయానికి గురి కావటమే కాదు.. ‘వామ్మో.. జగనా’ అని అనుకోకుండా ఉండలేం. కాదంటారా?