Begin typing your search above and press return to search.

బాబుకు ఆ రోజు వ‌స్తుంద‌న్న జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   11 Aug 2017 11:07 AM GMT
బాబుకు ఆ రోజు వ‌స్తుంద‌న్న జ‌గ‌న్‌
X
ఏపీ ప్ర‌జ‌ల‌నే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వారి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది నంద్యాల ఉప ఎన్నిక‌. ఏపీ అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య పోటాపోటీగా సాగుతున్న ఈ పోటీ తుది ఫ‌లితంపై స‌ర్వ‌త్రా ఉత్కంట వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ఉప ఎన్నిక‌ను ఏపీ ప్ర‌ధాన రాజ‌కీయ‌ప‌క్షాలు ప్ర‌తిష్ఠాత్మంగా తీసుకోవ‌టం.. ఫ‌లితాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చెప్పేందుకు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అలుపెర‌గ‌ని రీతిలో.. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. శుక్ర‌వారం ఆయ‌న త‌న ప్ర‌చారంలో భాగంగా పాండురంగాపురం లో రోడ్ షో నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు కుయుక్తుల‌కు ప‌ని చేయ‌ని గ్రామంగా అభివ‌ర్ణించారు. ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌క‌పోవ‌టం స‌రైన‌దేనా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌లు చేయ‌లేద‌న్నారు. నంద్యాల ఓట‌ర్లు వేసే ఓట్లు ఎవ‌రినో గెలిపించ‌టానికి కాద‌ని.. మూడున్న‌రేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పుగా చెప్పారు.

నంద్యాల ఓట‌ర్లు ఇచ్చిన తీర్పుతో ఏపీ రాష్ట్ర రాజ‌కీయం మార‌బోతుంద‌న్నారు. చంద్ర‌బాబు లాంటి మోసం చేసే నాయ‌కులు త‌మ‌కు వ‌ద్దంటున్నార‌న్నారు. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు మాట మీద నిల‌బ‌డాల‌న్న జ‌గ‌న్‌.. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవాల‌ని.. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల్ని అధికారంలోకి వ‌చ్చాక అమ‌లు చేయాల‌న్నారు. అలా చేయ‌కుండా ఉండ‌టం ప్ర‌జ‌ల్ని వెన్నుపోటు పొడ‌వ‌టంతో స‌మాన‌మ‌న్నారు. చంద్ర‌బాబును ప్ర‌జ‌లు వ‌ద్ద‌ని చెప్పే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంద‌న్నారు. బాబు చేసే అన్యాయాలు.. అధ‌ర్మాల‌కు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని జ‌గ‌న్ పిలుపునిచ్చారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు న్యాయం.. ధ‌ర్మం ప‌క్షాన నిల‌బ‌డాల‌న్నారు. శుక్ర‌వారం చాపిరేవ‌ల‌లో ప్ర‌చారం చేసిన జ‌గ‌న్‌.. ఊడుమాల్పురం.. పోలూరుల‌లో ప్ర‌చారం చేయ‌నున్నారు.