Begin typing your search above and press return to search.

పట్టిసీమలో ఈ బోనస్‌ ఏంటి బాబు..?

By:  Tupaki Desk   |   18 March 2015 10:21 AM GMT
పట్టిసీమలో ఈ బోనస్‌ ఏంటి బాబు..?
X
నిన్నమొన్నటి వరకూ విపక్ష నేతగా తేలిపోయినట్లు కనిపించిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తాజా బడ్జెట్‌ సమావేశాల్లో విభిన్నంగా చెలరేగిపోతున్నారు. తాజాగా పట్టిసీమ ప్రాజెక్టుపై ఏపీ సర్కారు ఉత్సాహంగా ముందుకెళుతున్న వైనంలోని అసలు విషయాన్ని బయట పెట్టే ప్రయత్నం చేసిన జగన్‌.. ఒక విషయంలో మాత్రం సందేహాలు రేపటంలో సక్సెస్‌ అయ్యారు.

చేయాల్పిన పెండింగ్‌ ప్రాజెక్టులు చాలానే ఉన్నా.. ఉన్నట్లుండి కొత్తగా పట్టిసీమ ప్రాజెక్టు మీద ప్రత్యేక ఫోకస్‌ చేయాల్సిన అవసరం ఏమిటంటూ ప్రశ్నించటమే కాదు.. కారణం ఇదేనంటూ బోనస్‌ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచినట్లుగా ఏపీ అధికారపక్షం చెప్పినప్పటికి పట్టిసీమ టెండర్ల ఫైల్‌ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు రాసినట్లుగా జగన్‌ చెబుతున్న అంశంపై మాత్రం ప్రత్యేక ఆసక్తి వ్యక్తమవుతోంది.

అదే సమయంలో పట్టిసీమపై జగన్‌ సంధిస్తున్నప్రశ్నలు కూడా సూటిగా ఉండటం మరో విషయం. పట్టిసీమ ద్వారా తరలిస్తున్న నీటిని ఎక్కడ నిల్వ చేస్తారంటూ ప్రశ్నించటమే కాదు.. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి సామర్థ్యం మూడు టీఎంసీలైతే.. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా వెళ్లే 80 టీఎంసీల నీటిని ఎక్కడ నిల్వ చేశారని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పట్టిసీమ ప్రాజెక్టు కోసం మెగా.. ఎల్‌ అండ్‌ టీ రెండు సంస్థలు మాత్రమే టెండర్‌ వేశాయన్న జగన్‌.. ఇదంతా ముందస్తు అవగాహనలో చేశారంటూ ఆరోపించారు. అన్నింటికి మించి.. ఐదుశాతం ఎక్సెస్‌ కు అనుమతించటమే కాదు.. 16.9శాతం బోనస్‌ అంటూ ముఖ్యమంత్రి బాబు నోట్‌ రాయటమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏపీ అధికారపక్షం సూటిగా సమాధానం చెబితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.