Begin typing your search above and press return to search.
రింగ్ లో చిప్ : బాబుకు ఇచ్చి పడేసిన జగన్...
By: Tupaki Desk | 9 July 2022 2:52 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు రింగ్ లో చిప్ మీద జగన్ సరైన సమయం చూసుకుని ఏసేశారు. చిప్ దేనికి ఎందుకు ఎక్కడ ఉండాలి అన్న దాని మీద ఆయన బాగానే క్లాస్ పీకారు. విషయానికి వస్తే ఈ మధ్య అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ టీడీపీ సమావేశంలో తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ అందులో చిప్ ఉందని, అది తన హెల్ చెకప్ గా ఉంటుందని, ఎప్పటికపుడు మానిటరింగ్ చేస్తుందని చెప్పుకున్నారు.
దాని వల్ల తన హెల్త్ ని సరిచేసుకుంటూ ముందుకు సాగవచ్చునని కూడా పేర్కొన్నారు. ఇది అదృష్ట ఉంగరం కాదు, ఆరోగ్యం ఉంగరం అని క్లారిటీ ఇస్తూ బాబు మీడియా ఎదుట చెప్పిన మాటలు ఇవి.
మరి దాని మీద జగన్ ప్లీనరీ ముగింపు మీటింగులో సెటైర్లు వేశారు. ఈ మధ్య చంద్రబాబు రింగ్ కి చిప్ పెట్టుకున్నానని అని చెబుతున్నారు. కానీ చిప్ ఎక్కడ ఉండాలో మాత్రం పెద్దాయనకు అసలు తెలియదని ఎద్దేవా చేశారు.
ఎవరికైనా చిప్ ఉండాల్సింది వేలికో మోకాలికో, అరికాలిలో కానే కాదని, చిప్ ఉండాల్సింది మెదడులో అంటూ గట్టిగానే రిటార్ట్ ఇచ్చేశారు జగన్. మెదడుతో ఉండాల్సిన చిప్ ఉంటే ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనలు వస్తాయని ఆయన అన్నారు. అలాగే గుండెలో చిప్ ఉన్నా బడుగుల పట్ల మమకారం ఉంటుందని ఆయన అన్నారు.
కానీ చంద్రబాబుకు ఉండాల్సిన చోట చిప్ లేదని వెటకారమాడిన జగన్ ఆయన పేదల వ్యతిరేకి అని మరో మారు రింగ్ లో చిప్ సాక్షిగా చాటారు. నాయకుడు అన్న వారికి ప్రజల సమస్యలు అర్ధం చేసుకునే చిప్ ఉండాలని కూడా జగన్ అనడం విశేషం.
పేదలకు మేలు చేయకూడదన్నదే చంద్రబాబు సహా దుష్ట చతుష్టయం ఆలోచన అని ఆయన అన్నారు. ఇదంతా సరైన చోట చిప్ లేకపోవడం వల్ల వచ్చిన పాట్లు అన్నట్లుగా జగన్ బాబు మీద చేసిన కామెంట్స్ ప్లీనరీలో ఆకట్టుకున్నాయి. మొత్తానికి రింగ్ లో చిప్ మాములు విషయమే కదా అని బాబు దాని గురించి రివీల్ చేస్తే అదే జగన్ కామెంట్స్ కి అస్త్రమైపోయింది.