Begin typing your search above and press return to search.
‘రద్దు’పై తొలిసారి జ‘గన్’ మార్క్ ఫైరింగ్
By: Tupaki Desk | 23 Nov 2016 7:21 AM GMTకొంతమంది మీద కొన్ని ఇమేజ్ లు ఉంటాయి. నిజానిజాలు నిరూపితం కాకున్నా.. వారి మీద మాత్రం తాము ఫీలైన ముద్ర కోణంలో నుంచే చూస్తుంటారు. ఇంకొందరైతే.. ఆరోపణలు నిరూపితం కాకుండా కొట్టేసినా కూడా తాము వేసిన ముద్రతోనే చూసే వైఖరి కనిపిస్తుంది. ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ పేరు ఎత్తిన వెంటనే.. ఆయనకు సంబంధించిన ముద్ర ఒకటి మన మనసుల్లో చప్పున గుర్తుకు రాక మానదు.
పెద్దనోట్లను రద్దు చేస్తూ.. ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్ ఆ అంశంపై ఇప్పటివరకూ స్పందించింది లేదు. 15 రోజుల తర్వాత తాజాగా..ఈ రోజు (బుధవారం) ఉదయం ఆయన రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బ్లాక్ మనీ మీద పెదవి విప్పారు. బ్లాక్ మనీ.. మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు అంశంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ఏం చెప్పారు? ఆయన మాటల్లో లాజిక్ ఉందా? లేదా? అర్థం అవుతుందా? లేదా? లాంటి విశ్లేషణ ఏమీ లేకుండా.. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చెప్పేస్తున్నాం. మరి.. మీరెలాఅర్థం చేసుకుంటారో మీ ఇష్టం. జగన్ ఏం మాట్లాడరంటే..
‘‘బ్లాక్ మనీని అరికడుతున్నాం. మీ అభిప్రాయం ఏమిటని? ఏ సామాన్యుడిని అడిగినా.. మంచిదనే చెబుతాడు. నిజంగానే వ్యవస్థ బాగుండాలంటే.. బ్లాక్ మనీకి అడ్డుకట్ట పడితే మంచిదనే అనుకుంటాం. మోడీగారు ఆ రోజు ప్రకటన చేసినప్పుడు అవినీతి నుంచి వస్తున్న నల్లధనాన్ని.. నల్ల బజారు వల్ల వస్తున్న నల్లధనాన్ని డ్రగ్స్.. ట్రాఫికింగ్ వల్ల వస్తున్న బ్లాక్ మనిని.. మనీ లాండరింగ్ వల్ల వస్తున్న బ్లాక్ మనీని.. ట్రాఫికింగ్ అండ్ కౌంటర్ ఫిట్ నోట్ల వల్ల వస్తున్న నల్లధనాన్ని పూర్తిగా అరికట్టే కార్యక్రమాన్ని చేస్తామని ప్రకటన చేశారు’’
‘‘వ్యవస్థ నుంచి నల్లధనం పోతుందని అందరూ కూడా మంచి నిర్ణయమే అనుకున్నాం. మనమైతే అందరూ సామాన్యులమే. వాళ్లు నిర్ణయం తీసుకొని మనకు చెబుతారు. మనమంతా ఇటువైపు రిసీవింగ్ ఎండ్ లో ఉన్నాం. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతును వినిపిస్తుంది. అధికార పార్టీ నిర్ణయాలతో ప్రతిపక్షానికి సంబంధం ఉండదు. కామన్ మ్యాన్ గా మనమంతా ఈ పక్క చూస్తుంటాం’’
‘‘కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేరా? అన్న విషయాన్ని ప్రతిపక్షం తెలియజేస్తుంది. ఇవాళ మాత్రం పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. కేంద్రం నిర్ణయంతో ప్రజలు ఎవరూ సంతోషంగా ఉన్నామని చెప్పే పరిస్థితుల్లో లేరు. పెద్దనోట్ల రద్దు లాంటి పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రతిపక్షాలను సంప్రదించటం.. సామాన్యులను సంప్రదించటం చేస్తుంటారు. ఆనిర్ణయం తర్వాత ఏర్పడే ప్రభావం నుంచి బయటపడే చర్యలు తీసుకోవటం జరుగుతుంది. కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అలా చేయలేదు. ఈ నిర్ణయంపై ప్రజల పక్షాన ప్రతిపక్షం గొంతు విప్పుతుంది’’
‘‘పెద్దనోట్లను రద్దు చేయగానే తన సూచన మేరకే కేంద్రం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు అన్నారు. అంత వేగంగా ఆయన ఎలా స్పందించగలిగారు. కేంద్రం సెలక్టివ్ పీపుల్స్ కు ముందే లీకులు ఇచ్చింది. అందులో చంద్రబాబు కూడా ఉన్నారు. అందులో భాగంగానే అక్టోబరు 12న చంద్రబాబు రూ.వెయ్యి.. రూ.500 నోట్లను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం నిర్ణయానికి సరిగ్గా నెల రోజుల ముందు చంద్రబాబు తన పరిస్థితులు చక్కబెట్టుకొని సామాన్యులను మాత్రం గాలికి వదిలేశారు. చంద్రబాబు చర్యలు చూశాక కూడా ఎవరికీ తెలియకుండా తాము నిర్ణయం వెలువరించామని కేంద్రం చెప్పే మాటల్ని ఎలా నమ్మాలి?’’
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/