Begin typing your search above and press return to search.
తెలంగాణ ఉద్యమం లాంటిదే.. ఏపీ హోదా: జగన్
By: Tupaki Desk | 10 Sep 2016 8:23 AM GMTఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైకాపా అసెంబ్లీ సమవేశాలను స్తంభింప జేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైకాపా అధినేత జగన్.. ఏపీ హోదా ఉద్యమం.. తెలంగాణ ఉద్యమం లాంటిదేనన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ కొన్ని ఏళ్లపాటు ఉద్యమం చేశారని, సాధ్యం కాదనుకున్న రాష్ట్రం సాధ్యమైందని, అలాగే హోదా కూడా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుందని ఆయన అన్నారు. అయితే, దీనికి ఒక టైం అనేది చెప్పడం సాధ్యం కాదని - అది రేపైనా లేదా వచ్చే ఏడాదైనా లేకపోతే మరికన్నేళ్లయినా పట్టొచ్చని చెప్పిన జగన్.. ఈ ప్రత్యేక హోదా పోరు ఆగదని చెప్పారు.
దీనికి రాష్ట్రంలోని అవ్వ - తాత - అక్కా చెల్లి అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు కూడా సాధ్యం కాదనుకున్నామని… కానీ తెలంగాణ ప్రజలు సుధీర్గంగా పోరాటం చేసి సాధించుకున్నారన్నారు. అలాగే హోదా కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాటానికి కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. హోదా సాధన ఒక్క జగన్ తోనే సాధ్యం కాదని… ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు కూడా భాగస్వామ్యులుగా ఉన్నారని… హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం చెప్పిన తర్వాత వారేం చేస్తున్నారని ప్రశ్నించారు.
అదేసమయంలో జగన్ 2019 ఎన్నికలకు సంబంధించి ఓ మాస్టర్ ప్లాన్ ను ఏపీ ప్రజల ముందుంచారు. 2019లో ఎవరు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారో వారికే తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. అప్పుడు కానీ, ఏపీకి హోదా రాదని జగన్ చెప్పారు. ఇప్పటికిప్పుడు అందరూ వెనక్కి తగ్గి.. హోదా రాదని చెబితే.. ఎవ్వరూ ఇకపై పట్టించుకోరని, ఇక, ఏపీ ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండబోదని అన్నారు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఈ పోరాటాన్ని ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఏదేమైనా జగన్ మాస్టర్ ప్లాన్ బాగుందని విశ్లేషకులు చెబుతుండడం గమనార్హం.