Begin typing your search above and press return to search.
సుదీర్ఘ పాదయాత్రలో జగన్ మరో మైలురాయి
By: Tupaki Desk | 24 Dec 2017 9:18 AM GMTప్రజాసమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి భారీ కష్టానికి సిద్ధమయ్యారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఆయన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాల్ని పట్టించుకోకుండా.. తాను అనున్నట్లుగా పేదల ఈతిబాధలు.. కష్టాలు తెలుసుకునేందుకు జగన్ ఎంతో కష్టపడుతున్నారు.
గ్రామ గ్రామాన తిరుగుతూ.. ప్రాంతాల వారీగా ఎక్కడేం సమస్య ఉందో తెలుసుకుంటున్న ఆయన.. ప్రజావ్యవస్థలోని లోపాలు.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఆయన గుర్తించి.. సూచనలు చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం తన మాటలని పట్టించుకోని వైనంపై తాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ సమస్యల్ని తీరుస్తానని హామీ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే.. జగన్ పాదయాత్ర నేటికి (ఆదివారం) 43వ రోజుకు చేరుకుంటుంది. అదే సమయంలో ఆయన తన 600 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు.
అనంతపురం జిల్లా కటారుపల్లి గ్రామానికి చేరుకున్న జగన్ కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు జగన్ పాదయాత్రకు ఎదురెళ్లి మరీ స్వాగతం పలకటం విశేషం. తన 600 కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసిన నేపథ్యంలో.. అందుకు గుర్తుగా ఒక మొక్కను నాటారు. అక్కడే పార్టీ జెండాను ఎగురవేసిన జగన్.. అక్కడి గ్రామస్థులతో ముచ్చట్లు పెట్టుకున్నారు. భోజన విరామం తర్వాత మళ్లీ తన పాదయాత్రను జగన్ కంటిన్యూ చేయమన్నారు.