Begin typing your search above and press return to search.
ముఖ్యమంత్రిగా జగన్ కు మూడేళ్లు పూర్తి.. విశ్లేషకులు ఏమంటున్నారంటే?
By: Tupaki Desk | 30 May 2022 5:45 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మే 30 నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేవలం 23 అసెంబ్లీ స్థానాలకు, 3 పార్లమెంటు సీట్లకే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు జగన్ మూడేళ్ల పాలనపై తమదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అద్బుత విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఎక్కువ మంత్రి పదవులు కేటాయించారనే పేరు తెచ్చుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలోనే తొలి దళిత హోం శాఖ మంత్రిగా మేకతోటి సుచరితకు అవకాశమిచ్చారు. మొత్తం కేబినెట్ లో ఉండాల్సినవారి సంఖ్య 25 మంది కాగా ప్రస్తుతం కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 17 మంది మంత్రులుగా ఉన్నారు.
గతంలో ఉన్న పథకాలకు తోడు కొత్త పథకాలను జగన్ ప్రవేశపెట్టారు. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్ర, మత్స్యకార భరోసా, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ, పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్ కాపునేస్తం, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ,. 108, 104, పింఛన్లు, ఇంటింటికీ రేషన్ తదితర కొత్త, పాత పథకాలతో ముందుకు సాగారు.
అలాగే ప్రభుత్వ సేవలను ప్రజలకు గ్రామాల్లోనే అందించడానికి గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో పనిచేయడానికి లక్ష మందికి ఉద్యోగులను నియామక పరీక్ష ద్వారా నియమించారు. అలాగే ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేయడానికి పట్టణాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ను, గ్రామాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వలంటీర్ ను నియమించారు. ఇక నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మరోవైపు అధికారంలోకి వస్తూనే వైఎస్ జగన్.. టీడీపీ హయాంలో రాజధాని ప్రాంతంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అలాగే రాష్ట్రానికి ఒక్క రాజధాని కాదు మూడు రాజధానులంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం సంచలనం రేపింది. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలన రాజధానిగా విశాఖ ఉంటాయని కలకలం రేపారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు, అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు అమరావతి రాజధానికే ఓటేసింది. మూడు రాజధానులు చెల్లవని చెప్పడంతో జగన్ కు బిగ్ షాక్ తగిలింది.
ఇక టీడీపీ హయాంలో చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేయలేదని.. చంద్రబాబు బినామీలకు కాంట్రాక్టు కట్టబెట్టి వందల కోట్ల రూపాయలు దోచేశారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే 2021 నాటికే పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. అయినా ఇంతవరకు పోలవరం పూర్తి కాలేదు. ఇక తనకు 20కి పైగా ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఊరూవాడా ఊదరగొట్టారని.. అయినా ఇంతవరకు దాని ఊసే లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి ఇంకో ముఖ్యమైన విశాఖ రైల్వే జోన్ అంశం కూడా ఎక్కడి వేసిన గొంగళి అక్కేడ అన్న చందంగా ఉందని అంటున్నారు.
తనకున్న 22 ఎంపీల బలాన్ని జగన్ తన కేసుల మాఫీకి వాడుకుంటున్నారని, అవసరమైనప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తన పూర్తి మద్దతును అందిస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.
ఇక జగన్ ఈ మూడేళ్ల పాలనలో కోవిడ్ విజృంభించింది. కొన్ని వేల మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. ఆక్సిజన్ కొరతతో కోవిడ్ రోగులు పిట్టల్లా రాలిపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి జగన్ లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నాడని నిపుణులు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం మొత్తం అప్పు 8 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని గుర్తు చేస్తున్నారు. ఇంకా జగన్ కు రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఈ అప్పు మరో 3 లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందని.. మొత్తం మీద రాష్ట్రం అప్పు 11 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక మంత్రులు పరిపాలన మీద కంటే కూడా ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టడానికే పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి. కొడాలి నాని, అనిల్ కుమార్, అంబటి రాంబాబు, రోజా తదితరులంతా ప్రతిపక్ష నేతలపై అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలకు పరిమితమయ్యారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల కుటుంబాలకు చెందిన మహిళలను, చిన్న పిల్లలపై కూడా అసభ్య వ్యాఖ్యలు చేయించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందని చెబుతున్నారు. తమ పార్టీ నేతల అసభ్య వ్యాఖ్యలను ఖండించకుండా జగన్ వెనకేసుకురావడం, అందులోనూ ఎవరైతే ప్రతిపక్ష నేతల మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారో వారికే జగన్ మంత్రి పదవులు కూడా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
అలాగే జగన్ ప్రభుత్వంలో ఒకరిద్దరు మంత్రులకు తప్ప మిగతా ఎవరికీ ఆ శాఖలపై పట్టు లేదని, అన్ని శాఖలకు తానే మంత్రిలా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించడం కూడా తీవ్ర వివాదాస్పదమైందని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. హైకోర్టు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఆ పదవిలో నియమించొద్దని, అలాగే పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తీవ్ర వివాదాస్పదమైంది.
ఇక జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కరువైందని.. రోడ్ల దుస్థితి దారుణంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పేరున్న ఒక కొత్త కంపెనీ కూడా రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు చేయలేదని.. పెట్టుబడులు కూడా రాలేదని, రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా అతీగతీ లేవని తీవ్రంగా దుయ్యబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సినవాటిని కూడా జగన్ సాధించుకోలేకపోయారని.. ఆయనపై కేసుల భయమే ఇందుకు కారణమని ప్రతిపక్షాలు దునుమాడుతున్నాయి.
మరోవైపు జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందనే అపప్రథను మూటగట్టుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, నారాయణ, పట్టాభి, వైఎస్సార్సీపీ అసమ్మతి నేత రఘురామకృష్ణరాజు తదితరులను అరెస్టు చేయించిందని గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేలా వ్యవహరించిందని గుర్తు చేస్తున్నారు. ఇలా మూడేళ్ల జగన్ పాలనలో విధ్వంసం.. వినాశనం తప్ప గొప్ప అభివృద్ధి ఏమీ లేదని చెబుతున్నారు.