Begin typing your search above and press return to search.

జగన్ పొదుపు మంత్రం...మంత్రులకు ఇక చెక్

By:  Tupaki Desk   |   31 May 2019 2:30 PM GMT
జగన్ పొదుపు మంత్రం...మంత్రులకు ఇక చెక్
X
దేశంలోనే ఎప్పుడు లేనంతగా తిరుగులేని విజయాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాళ్లు కూడా అదే రీతిలో స్వాగతం పలుకుతున్నాయి.. ప్రధానంగా నవరత్నాలంటూ ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ప్రధానంగా వనరుల సమస్య కొంత అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది.. ప్రధానంగా ఆర్థిక లోటుతో పాటు - గత ప్రభుత్వం చేసిన అప్పులు దాదాపు 2 లక్షల కోట్లకు పైగా ఉండటం తో ఆర్థిక క్రమశిక్షణపై జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది...

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా తనకు వచ్చే జీతాన్ని కేవలం ఒక్క రూపాయికే పరిమితం చేసుకున్నారంటున్నారు.. అలాగే ఆర్థిక శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్ ఎస్ రావత్ ను నియమించుకున్నారు.. గతంలో ఫైనాన్స్ కార్యదర్శిగా పనిచేసిన మాజీ సీఎస్ అజేయ కల్లాంను సలహాదారుగా నియమించుకోవడం అందులో భాగమేనంటున్నారు. అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి బెస్ట్ అండ్ బెటర్ టీం ను రూపొందించుకోబోతున్నారు నూతన ముఖ్యమంత్రి.. ఈ నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణకు పెద్ద పీట వేస్తూ.. అన్ని స్థాయిల్లో ఖర్చుకూ కోత పెట్టబోతున్నారు ..

ఇప్పటికే శాఖల వారీగా విదేశీ పర్యటనలు - అనవసర ఖర్చులు తగ్గించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.. అలాగే ఈనెల 7న చేపట్టబోతున్న క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కొత్తగా ఎన్నికైన మంత్రులకు కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ జగన్ నిర్ధేశించబోతున్నారంటున్నారు.. ముఖ్యంగా మంత్రులు ఫెషీలలో సిబ్బందిని తగ్గించడం తో పాటు అలవైన్సులు అనవసర ఖర్చులు - హంగు ఆర్భాటాలు తగ్గించడంతో పాటు పార్టీ పరంగా - వ్యక్తిగతంగా హజరయ్యే పనులకు సొంత ఖర్చులు పెట్టుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నారంటున్నారు.. గత ప్రభుత్వంలో మంత్రులు విచ్చలవిడిగా సొంత పనులకు అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు భారీ మొత్తంలో ప్రభుత్వ ధనాన్ని వినియోగించారన్న సమాచారం నేఫథ్యంలో మంత్రుల ఆర్థిక క్రమశిక్షణ విషయంలో సీఎం జగన్ సీరియస్ గా ఉండబోతున్నారంటున్నారు...