Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతున్నాడు

By:  Tupaki Desk   |   14 Nov 2016 10:30 PM GMT
జ‌గ‌న్ ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతున్నాడు
X
కొన్ని నెల‌ల క్రితం ఏపీలో జ‌రిగిన ప‌రిణామాలు గుర్తుండే ఉంటాయి. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికార తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఇత‌ర పార్టీలు ముఖ్యంగా వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకునే ఆప‌రేష‌న్ న‌డిపింది. ఏపీ ముఖ్య‌మంత్రి-టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్వ‌యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల‌కు కండువా క‌ప్పారు. ఈ ప్ర‌క్రియ‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి ప‌క్క‌న‌పెడితే...వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ కు మాత్రం పెద్ద దెబ్బ‌గా మారింది. ఆ షాక్ నుంచి పాఠం నేర్చుకున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఆపరేషన్ ఆకర్ష్ ఎర‌కు చిక్క‌కుండా ఎమ్మెల్యేల విష‌యంలో జాగ్ర‌త్త ప‌డుతున్నారు. పెండింగ్‌లోని కార్పొరేషన్ - మున్సిపాలిటీలకు ఎన్నికలు వస్తున్న సందర్భంలో జ‌గ‌న్ త‌న ప్లానింగ్‌ ను మార్చుకున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా పెండింగ్‌లో ఉన్న కర్నూలు - తిరుపతి - శ్రీకాకుళం గ్రేటర్‌ విశాఖ - కాకినాడ - గుంటూరు - ఒంగోలు మున్సిపల్‌ కార్పోరేషన్లకు రాజంపేట - రాజమండ్రి. నెల్లిమర్ల - కందుకూరు మున్సిపాలిటీలకు త్వరలో ముహుర్తుం ఖరారు కానున్నది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయం కోసం అధికార టీడీపీతోపాటు అన్ని పక్షాలు ఈ ఎన్నికలకు సన్నద్దమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో స్థానికంగా అవగాహన చేసుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ గెలుపుపై కూడా అంతే పకడ్భందీగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దాదాపు 20 మంది ఎమ్మెల్యేలను టీడీపీ వల వేసిన విషయం తెలిసిందే. ఈ ఫిరాయింపులన్నీ నాడు జరిగిన రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనేనని కూడా ప్రచారం జరిగింది. అయితే అనుకొన్న మేర వైసీపీ ఎమ్మెల్యేలు తనవైపునకు రాకపోవడంతో తనకున్న బలానికి మించి రాజ్యసభ సభ్యుడిని ఎన్నికల బరిలోకి టీడీపీ నాడు దించలేదు. అయితే రాష్ట్రంలో టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్న తరుణంలో ఇప్పుడు జరిగే పెండింగ్‌ మున్సిపల్‌ - కార్పోరేషన్‌ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మరీ ముఖ్యంగా అధికార పార్టీకి పెద్ద సవాల్‌ గా మారుతాయని, దీని ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఈ పెండింగ్‌ కార్పోరేషన్‌ - మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీతో తలపడటంతోపాటు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు - ఆయా పరిధిలోని స్థానిక బలమైన నేతలు చేజారకుండా చూసుకోవాలని వైసిపి సమాలోచనలు చేస్తోంది. ఈ ఎన్నికలు జరిగే అవకాశమున్న కార్పోరేషన్‌ - మున్సిపాలిటీ పరిధిలో కూడా ఎమ్మెల్యే, నేతలను తనవైపు ఆకర్షించే యత్నం టీడీపీ మొదలెడితే మాత్రం పార్టీకి కొంత నష్టమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ మళ్లీ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించే అవకాశముందన్న సమాచారం అందుకోవడంతో వైసీపీ నాయకత్వం ఆ నష్టం జరగకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కర్నూలు - తిరుపతి శ్రీకాకుళం గ్రేటర్‌ విశాఖ - కాకినాడ - గుంటూరు - ఒంగోలు మున్సిపల్‌ కార్పో రేషన్లకు రాజంపేట - రాజమండ్రి. నెల్లిమర్ల - కందుకూరు మున్సిపాలిటీల కు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశమున్న విషయం తెలిసిందే. ఈ కార్పోరేషన్‌ - మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశమున్న నియోజకవర్గ పరిధిలో ప్రభావితం చేయగల తమ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపి వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ప్రతి ఎమ్మెల్యే - నేతలతో వైసిపి లోని సీనియర్‌ నేతలు మంతనాలు-నిరంతర సమన్వయం చేసుకొంటున్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/