Begin typing your search above and press return to search.
జగన్ కొత్తగా ట్రై చేస్తున్నాడు
By: Tupaki Desk | 2 Oct 2016 9:27 AM GMTరెండు శాతం ఓట్ల తేడాతో గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారానికి దూరమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆ లోటును భర్తీ చేసుకొనే ప్రయత్నాలను మొదలెట్టింది. యువతరం ఓట్లకు గాళం వేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో పాగావేసే దిశగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా ప్రత్యేకహోదా అంశంపై విస్తృతంగా పోరాటం చేస్తూ యువతను ఆకర్షించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే యువభేరీల ద్వారా ప్రభంజనం సృష్టిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇకపై ప్రత్యేకహోదా పోరు విషయంలో యువతను భాగస్వామ్యం చేసే దిశగా పావులు కదుపుతోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్టవ్రిభజన వల్ల విభజిత ఆంధ్రప్రేదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏపీ యువత మెజార్టీగా టీడీపీ - బీజేపీ కూటమికే ఓటు వేసింది. అందుకే తమ పార్టీపై టీడీపీ కేవలం రెండు శాతం ఓట్లు తేడాతో పైచెయ్యి సాధించి అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. నాడు విభజిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా కేంద్ర, రాష్ట్రాలలో ఒకే కూటమి అధికారంలోకి వస్తే తమ భవిష్యత్తు బాగుంటుందన్న కారణంతో నాడు యువత ఆ రెండు పార్టీల కూటమికి ఓట్లు వేశారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ ఒక్క కారణంతోనే నాడు తమకు అధికారం చేజారిందని - తాము ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పక్కనపెట్టి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో సరిపెట్టిన నేపథ్యంలో టీడీపీ-బీజేపీ కూటమీలకు ప్రతికూల వాతావరణం సృష్టిస్తోంది. దీంతో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలపై యువతరం ఆగ్రహం పెట్రేగిపోతుండటంతో దానిని తమ పార్టీకి అనుకూలంగా మల్చుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.
ఏపీకి ప్రత్యేకహోదా రావడం ద్వారా పరిశ్రమలు రావడం - ఇతర మౌళిక వసతులు మెరుగుపడటం - ఉపాధి - ఉద్యోగ అవకాశాలు పెరగటం జరుగుతుందన్న ఊదాహరణలు ఇప్పటికే ప్రత్యేకహోదా పొందుతున్న రాష్ట్రాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రచారాన్ని ఇప్పటికే గణాంకాల ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదలెట్టింది. దీంతో ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ఈ రాష్ట్ర ప్రజానికంలో రోజురోజుకు అది సెంటిమెంటుగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా హోదాపై యువతరం ఎన్నో ఆశలతో ఉన్న సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ దానిని విస్మరించింది. దీంతో తమ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామన్న భావనలో ఉన్న యువతరం రగలిపోతోందన్న అంచనాతో అన్ని పార్టీలు ప్రత్యేకహోదా పోరాటంలో దిగుతున్నాయి. ఈ యువతరం ఆవేశాన్ని ఉద్యమంగా మల్చి ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై ఇప్పటికే వివిధ జిల్లాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువభేరీల పేరుతో సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మిగితా జిల్లాలలో కూడా ఈ యువ భేరీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఆ పార్టీ సిద్దమవుతోంది. కేవలం యువతనే ఈ సభలకు ఆహ్వానించడం, ఏపీకి ప్రత్యేక హోదా వస్తే వచ్చేలాభాలు - ప్రయోజనాలను వివరిస్తూ రాకపోతే యువతకు ఉపాధి - ఉద్యోగాల్లో జరిగే నష్టాలను వివరిస్తూ ఈ యువభేరీ కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యువతే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకెళ్తోంది. యువతను ఆకర్షించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో వారి మద్దతు పొందడంతోపాటు ఇప్పటికే ఇతర వర్గాల కోసం పోరాడుతున్న నేపథ్యంలో వారి సానుభూతి వచ్చే ఎన్నికల్లో సాధించవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/