Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ తేల్చేశాడు.. ప‌వ‌న్ నానుస్తున్నాడు

By:  Tupaki Desk   |   11 Nov 2018 8:47 AM GMT
జ‌గ‌న్ తేల్చేశాడు.. ప‌వ‌న్ నానుస్తున్నాడు
X
తెలంగాణ‌లో రాజ‌కీయాలు కాక‌మీద‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. నామినేషన్లకు ఓవైపు సమయం ముంచుకొస్తుండగా ముందే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన అధికార టీఆర్ ఎస్ పార్టీ త‌న‌దైన శైలిలో దూసుకువెళ్తోంది. అభ్య‌ర్థులు ఇప్ప‌టికే ఓ రౌండ్ ప్ర‌చారం పూర్తిచేశారు. మ‌రోవైపు కాంగ్రెస్ సార‌థ్యంలో ప్ర‌జా కూటమిలో సీట్ల పంచాయితీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు! టీడీపీ త‌న‌కు ఇచ్చిన దాంతోనే సంతృప్తి ప‌డుతోంది!! రెండు నెలలుగా సీట్ల లెక్క కుదరకపోవడంతో సీపీఐ - టీజేఎస్ విసిగిపోయాయనే వార్త‌లు వ‌స్తున్నాయి!!! వామ‌పక్ష పార్టీల్లో ఒక‌టైన సీపీఎం త‌న కొత్త‌వేదిక‌తో ముందుకు సాగుతోంది. ఇక అంద‌రి చూపు ప్ర‌ధాన పార్టీల్లో ఒక‌టైన వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ - జ‌న‌సేన‌ల‌పై ప‌డింది. ఇందులో వైసీపీ త‌న స్టాండ్‌ ను తేల్చేయ‌గా - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు.

తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీఆర్ ఎస్ ఒంట‌రి పోరు - బీజేపీ కాంగ్రెస్‌ లు కూట‌ముల రూపంలో ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయా పార్టీలు పొత్తులు - అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌ను పూర్తిచేసి బీఫాంల ద‌శ‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌న‌ వైఖ‌రిని ప్ర‌క‌టించింది. పార్టీ దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్‌ లో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల మీదే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన పరిణామాలను బేరీజు వేసుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని - అదే సమయంలో 2024 ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా బలపడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని ప్రకటనలో వివరించింది. అయితే, జ‌న‌సేన పార్టీ మాత్రం త‌మ వైఖ‌రిని వెల్ల‌డించ‌కలేక‌పోతోంది. ఇంకా నాన్చివేత దోర‌ణిని అవ‌లంభిస్తోంది.

గ‌తంలో జ‌న‌సేన‌తో పొత్తుకు సీపీఎం ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి తెలంగాణలో జ‌న‌సేన‌కు మూడు నుంచి ఐదు నియోజ‌క‌వ‌ర్గాల లోపే...ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసే శ‌క్తి ఉంది. ఇక సీపీఎం విష‌యానికి వ‌స్తే..గతంలో ఆ పార్టీ అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ....ఇటీవ‌ల నామ్‌కేవాస్తీగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీలు దోస్తీ క‌ట్టినా...రాబోయే ఎన్నిక‌పై ఎంత మేర‌కు ప్ర‌భావం చూపుతుందో అనే సందేహం వ్య‌క్త‌మైంది. అనంత‌రం సీపీఎం త‌న‌దారి తాను చూసుకొని బీఎల్‌ పీ పేరుతో బ‌రిలో దిగుతోంది. ఇలా మిత్ర‌ప‌క్షంగా ఉండాల‌ని ఆరాట‌ప‌డ్డ పార్టీ త‌న దారి తాను చూసుకున్నా కూడా ప‌వ‌న్ ఇంకా త‌న స్టాండ్ ప్ర‌క‌టించ‌లేదు. మ‌రోవైపు నాలుగైదురోజుల్లో తెలంగాణ‌లో పోటీపై ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని ప‌వ‌న్ పేరుతో ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కానీ ఇది జ‌రిగి ప‌దిహేను రోజులైన ప‌వ‌న్ త‌న స్టాండ్ వెలువ‌రించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వేళ‌ - ఏపీ ఒక్క‌ రాష్ట్రం పైనే తాము దృష్టి సారించామ‌ని ప‌వ‌న్ చెప్ప‌ద‌ల్చుకుంటే - ఆ విష‌యంలో మొహ‌మాటం ఎందుక‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.