Begin typing your search above and press return to search.
బాబును ఇరుకునపెట్టే 'దగ్గుబాటి' ప్లాన్
By: Tupaki Desk | 14 May 2019 5:00 AM GMTచంద్రబాబు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఇద్దరు తోడల్లల్లు.. దివంగత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అల్లుల్లు. ఈ ఇద్దరూ ఎన్టీఆర్ ను పదవీచిత్యుడిని చేసి టీడీపీని హస్తగతం చేసుకున్నవారే.. చంద్రబాబు సీఎం కావడంలో దగ్గుబాటి పాత్ర చాలా ఉంది. కానీ వీరిద్దరికి ఎక్కడో చెడింది.. చంద్రబాబు టీడీపీని హైజాక్ చేశారు.. ఏకంగా ఏపీకి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ దగ్గుబాటి మాత్రం బాబు తనను మోసం చేశాడని.. తనను రాజకీయంగా ముంచేశాడని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. చంద్రబాబు మోసాలపై పుస్తకాలు రాస్తూ రాజకీయాలకు దూరం జరిగారు.
ఈ ఇద్దరిలో చంద్రబాబు టీడీపీ అధ్యక్షులు.. ముఖ్యమంత్రిగా ఎంతో ఎత్తున ఉన్నారు.. కానీ దగ్గుబాటి మాత్రం రాజకీయంగా తన ఉనికినే కోల్పోయారు. కానీ మరికొద్దిరోజుల్లోనే సీన్ మారబోతోందని వైసీపీ వర్గాలు చర్చోపచర్చలు చేస్తున్నారు. తనకు శత్రువుగా మారిన దగ్గుబాటిని ఇక గౌరవవాచకంగా పిలవని పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కోబోతున్నారట. వైసీపీ వేసిన ఈ స్కెచ్ కు చంద్రబాబు క్లీన్ బోల్డ్ కావడంతోపాటు చాలా ఇరుకునపడిపోవడం ఖాయమని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇంతకీ వైసీపీ వేసిన ప్లానేంటి.?
మే 23న ఏపీలో అసెంబ్లీ ఫలితాలొస్తాయి. అప్పుడే అధికారం ఎవరిదనేది తేలుతుంది. కానీ అప్పటివరకు ఫలితంపై అందరూ నెమ్మదించరు కదా.. ఇంటెలిజెన్స్ - వివిధ జాతీయ సర్వేల ఆధారంగా అంచనా వేసుకుంటారు. ఇప్పుడు సర్వేలన్నీ వైసీపీ అధికారంలోకి వస్తాయంటున్నారు. అందుకే జగన్ తన టీంను రెడీ చేసుకుంటున్నారని సమాచారం. జగన్ ముఖ్యమంత్రి అయితే మంత్రులెవరు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - సీఎంవో అధికారులు ఎవరు అనే దానిపై వైసీపీ కసరత్తు మొదలుపెట్టిందట..
అయితే ఈ విషయం ఎలా ఉన్నా చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు అధికారంలోకి రాగానే ఏపీ శాసనసభ స్పీకర్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావును జగన్ ఎంపిక చేస్తారని పార్టీలో ఓ చర్చ నడుస్తోంది. దగ్గుబాటి వైసీపీలో కొత్తగా చేరినా.. కీలక నేత.. రాజకీయాల్లో ఆరితేరిన నేత. ఎప్పుడో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఉమ్మడి అసెంబ్లీకి - పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించిన నేత..కానీ ఇక్కడే అసలు మెలిక ఉంది..
స్పీకర్ గా దగ్గుబాటిని జగన్ చేస్తే ప్రతిపక్ష నేతగా ఉండే చంద్రబాబు ఆయనను అధ్యక్షా అని సంభోదించాలి. ఇలా ఐదేళ్ల పాటు దగ్గుబాటిని ఇలాగే గౌరవించాలి. ఇప్పటికే ఉప్పు-నిప్పులా ఉండే వీరిద్దరి మధ్య ఈ ఎత్తుగడతో చంద్రబాబు మానసికంగా నలిగిపోవడం ఖాయమని వైసీపీ ప్లాన్ చేస్తోంది.
ఇప్పుడు రాజకీయంగా చంద్రబాబు అందనంత ఎత్తులో ఉన్నారు. దగ్గుబాటి ఆయన ప్రత్యర్థిగా రాజకీయాల్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చారు. నిజానికి దగ్గుబాటి ఈ ఎన్నికల్లో పోటీచేయాలనుకోలేదు. ఆయన కుమారుడు హితేష్ ను పర్చూర్ నుంచి పోటీకి దింపి తాను వెనుకాల ఉండి నడిపించాలనుకున్నాడు. కానీ హితేష్ అమెరికా పౌరసత్వం రద్దుకాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా దగ్గుబాటి పోటీచేశారు.
ఇప్పుడు వైసీపీ గెలిచి అధికారంలోకి వస్తే స్పీకర్ గా దగ్గుబాటిని ఎంపిక చేయడం ఖాయమని వైసీపీ శ్రేణులు నమ్మకంగా చెబుతున్నాయి. ఐదేళ్ల పాటు చంద్రబాబు.. దగ్గుబాటిని అధ్యక్ష అని పిలిచే అనివార్య పరిస్థితిని కల్పిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఫలితాల రాకముందే ఇలా ఊహించేసుకోవడంలో అర్థం లేకున్నా.. ప్రత్యర్థి - శత్రువుగా భావించే దగ్గుబాటిని చంద్రబాబు గౌరవంగా పిలవక తప్పని కోణం మాత్రం రాజకీయ వర్గాలను ఆకర్షిస్తోంది. మరి ఫలితాల తర్వాతే ఏం జరుగనుందో చూడాలి మరి..