Begin typing your search above and press return to search.
మాజీలకు షాక్: మరో దండగపై జగన్ దృష్టి
By: Tupaki Desk | 11 Feb 2020 9:45 AM GMTపరిపాలనా పరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నారు. ఆర్థికంగా అప్పులో ఉన్న రాష్ట్రంలో పొదుపు చర్యలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే శాసనమండలి వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించింది. మండలి రద్దు నిర్ణయం రాజకీయంగా - పాలనపరంగాను కలిసిరావడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కొంత భారం తగ్గుతుందనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందితే మండలి రద్దు అమల్లోకి వస్తుంది. ఇప్పుడు మరో అంశంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాసనమండలి దండగ అంటూ ముందుకువెళ్లగా ఇప్పుడు దండగ ఉన్న మరో అంశంపై ఫోకస్ పెట్టారు.
అనవసర ఖర్చు అనే ఉద్దేశంతో మాజీలకు భద్రతపై కోత విధించాలని నిర్ణయించినట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రులు - మాజీ ఎంపీలు - మాజీ ఎమ్మెల్యేలు - మాజీ ఎమ్మెల్సీలు తదితర మాజీలను పోషించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. వారు పదవుల్లో ఉన్నా లేకున్నా ప్రభుత్వ సదుపాయాలు మాత్రం సక్రమంగా పొందుతున్నారు. నివాసాలు మొదలుకుని భద్రత వరకు అన్నీ ప్రభుత్వమే పోషిస్తోంది. ఇకముందు వీరిపై చర్యలు తీసుకునే ఆలోచన ఏపీ ప్రభుత్వం చేయనుంది.
ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. మాజీ ప్రజాప్రతినిధులకు భద్రతను కుదింపు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ మాజీ మంత్రులు - మాజీ సీఎంలు - మాజీ ఎంపీలు - మాజీ ఎమ్మెల్యేలు - మాజీ ఎమ్మెల్సీలకు గన్ మెన్లను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. పూర్తిగా గన్ మెన్లను ఉపసంహరించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విపక్ష నేతల భద్రతను భారీగా తగ్గించారు. ఇప్పుడు మరోసారి మాజీలకు భద్రతను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అందులో భాగంగానే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి భద్రతను తొలగించారు. మొదట 2+2 ఉన్న భద్రతను 1+1 చేయగా ఇటీవల ఆ 1+1 భద్రతను కూడా ఏపీ ప్రభుత్వం తొలగించింది.
మాజీలకు భద్రత తొలగించడం జరిగితే తీవ్ర విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఎన్నికల్లో అనేకమంది మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో చేసిన సేవలకు వారికి ఇప్పటివరకు భద్రత కొనసాగుతోంది. వారందరికీ భద్రత కల్పించడం భారీ ఖర్చుతో కూడుకున్న యవ్వారం.. రాష్ట్రం నష్టాల్లో ఉన్న సమయంలో వారికి ఎందుకు అంత ఖర్చు అనేది ప్రభుత్వ ఉద్దేశం. వారి వల్ల వచ్చేది లేదు.. పోయేది లేదనే అభిప్రాయంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకుంటే టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మాజీల్లో తమ పార్టీ నాయకులు కూడా ఉన్నారనే విషయం తెలుసుకోవాలని పలువురు గుర్తుచేస్తున్నారు.