Begin typing your search above and press return to search.
ఏందన్నా.. జగన్ అలా దెబ్బేశాడు?
By: Tupaki Desk | 1 May 2018 5:46 AM GMTటీజర్ అదిరిపోయింది. ప్రజా సంకల్పం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా తాజాగా కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇచ్చిన హామీ తెలుగు తమ్ముళ్లకు దిమ్మ తిరిగి.. మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిందని చెబుతున్నారు. తాము అధికారంలోకి వచ్చినంతనే కృష్ణా జిల్లాకు నందమూరి తారకరామారావు..ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడతాం.. అంటూ సూటిగా ఇచ్చేసిన జగన్ హామీ టీడీపీ శిబిరంలో రేపిన అలజడి అంతా ఇంతా కాదంటున్నారు. జగన్ పాదయాత్రను లైట్ తీసుకున్న చాలామంది.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యతో ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు.
ఇప్పటివరకూ జగన్ పాదయాత్ర ప్రభావం పెద్దగా లేదన్న వారే.. తాజా వ్యాఖ్య తర్వాత మొదలెట్టిన క్రాస్ చెకింగ్ తర్వాత.. జగన్ ఇంతలా జనాల్లోకి ఎప్పుడు వెళ్లిపోయారంటూ ఆశ్చర్యంతో సంధిస్తున్న ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజా పరిణామాలు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టటం అన్నది చిన్న టీజర్ లాంటిదేనని.. రానున్న రోజుల్లో జగన్ నోటి నుంచి మరిన్ని హామీలు రానున్నాయని.. అవన్నీ ట్రైలర్లు అని.. ఇక పాదయాత్ర ముగిసిన తర్వాత ఎన్నికల ప్రచారం వేళ జగన్ అనుసరించే వ్యూహం తెలుగు తమ్ముళ్లకు షాకుల మీద షాకులు ఇవ్వటం ఖాయమని చెబుతున్నారు.
గడిచిన ఐదు నెలలుగా ప్రజల్లో ఉన్న జగన్.. వారి అనుచర బృందం.. ప్రజల అవసరాలతోపాటు.. బాబు సర్కారు మీద ఉన్న వ్యతిరేకతను అంచనా కట్టటంలో సక్సెస్ కావటమే కాదు.. ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకుంటూ వస్తున్నారు. ఎక్కడికక్కడ.. ఎవరికేం అవసరమో.. వాటిని ప్రస్తావిస్తూ.. పరిష్కారం కోసం తాను ప్రయత్నిస్తానని నమ్మకంగా చెబుతున్న జగన్ మాటలు తెలుగు తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి.
చేతిలో అధికారం ఉండి కూడా.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలన్న స్థానికుల ఆలోచనను తాము పసిగట్టటంలోనే తమ వైఫల్యం ఉందంటూ టీడీపీ నేతలు పలువురు ఇప్పుడు వాపోతున్నారు. కొట్టాల్సిన దెబ్బను జగన్ గురి చూసి మరీ కొట్టారని.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్న హామీ చూపించే ప్రభావం అంతా ఇంతా కాదంటున్నారు.
తాజా హామీతో కృష్ణా జిల్లాలోని బలమైన సామాజిక వర్గం మీద ప్రభావం చూపించటంతో పాటు.. టీడీపీని దెబ్బ తీసేలా చేస్తుందని చెబుతున్నారు. జగన్ హామీ పెద్దచర్చకు తెర తీయటమే కాదు.. తాజాగా కొందరు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జగన్ ఇచ్చిన హామీ తరహాలో తమ అధినేతకు ఎందుకు తట్టటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు.. తమను తాము మట్టిబుర్రలుగా అభివర్ణిస్తున్నారు. అంతేనా..పాదయాత్రకు జగన్ కు వస్తున్న ప్రజాస్పందన చూస్తుంటే.. ఎక్కడో తేడా కొడుతోందంటూ టీడీపీ ముఖ్యనేత ఒకరు చేస్తున్న వ్యాఖ్య ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.