Begin typing your search above and press return to search.

జగన్ డేరింగ్..అంబానీనే వెయిటింగ్ లో పెట్టేశారు

By:  Tupaki Desk   |   3 March 2020 5:04 PM GMT
జగన్ డేరింగ్..అంబానీనే వెయిటింగ్ లో పెట్టేశారు
X
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అంతగా అనుభవం లేకున్నా... ఓ రాజకీయ పార్టీ నిర్వహణలో మాత్రం రాటుదేలిపోయారనే చెప్పాలి. పార్టీ వ్యవహారాల్లో జగన్ ఎంతగా రాటుదేలిపోయారంటే... భారత అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కొడుకును వెంటేసుకుని మరీ తన ఇంటికి వచ్చి ఓ చిన్న కోరిక కోరితే... దానిపై అప్పటికప్పుడు తేల్చేయకుండా... తాను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకు ఓ మూడు రోజుల సమయం కావాలని, అప్పటిదాకా మీరు వెయిట్ చేయక తప్పదని ముఖం మీదే చెప్పేసేంతగా. నిజమా? బీజేపీ కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్ చేయించుకుని మరీ వచ్చిన అంబానీని జగన్ ఇలా వెయిటింగ్ లో పెట్టారా? అంటే... నిజమేనని అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీనే స్వయంగా చెప్పేశారు.

రెండు రోజుల క్రితం ముఖేశ్ అంబానీ... తన కుమారుడు అనంత్ అంబానీతో పాటుగా తన కంపెనీలో అత్యంత కీలక వ్యక్తి, బీజేపీ- రిలయన్స్ మధ్య సంబంధాలను పర్యవేక్షించే పరిమళ్ నత్వానీని వెంటేసుకుని తాడేపల్లిలోని జగన్ ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే కదా. త్వరలో రాజ్యసభ సభ్యుడిగా పదవీ విమరణ చేయనున్న పరిమళ్ ను మరోమారు రాజ్యసభకు పంపించాలని ముఖేశ్ భావిస్తున్నారు. ఇదే మాటను అమిత్ షాకు చెప్పి ఓకే అనిపించేసుకున్నారు. అయితే బీజేపీకి దక్కే ఓకటి అరా సీట్లలో నత్వానీకి ఓ సీటు ఇవ్వడం సాధ్యం కాదని, తమతో గుడ్ టెర్మ్స్ కొనసాగిస్తున్న వైసీపీ ద్వారా టికెట్ ఇప్పిస్తామని చెప్పడంతో పాటుగా వైసీపీ అధినేతను కలవండన్న అమిత్ షా మాటతో ముఖేశ్ అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా జగన్, ముఖేశ్ బృందం మధ్య చర్చలు జరిగాయి. ముఖేశ్ బ్యాచ్ వెళ్లిపోయింది. లోపల ఏం జరిగిందనే విషయం నిన్నటిదాకా ఏ ఒక్కరికీ తెలియదు.

అయితే తాజాగా పార్లమెంటు ఆవరణలోనే నత్వానీ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన సందర్భంగా జగన్ తో భేటీలో ఏఏం జరిగిందన్న వివరాలను వెల్లడించారు. తనకు రాజ్యసభ టికెట్ కోసమే జగన్ వద్దకు తాము వెళ్లామని నత్వానీ చెప్పేశారు. అంతేకాకుండా తనకు రాజ్యసభ సీటివ్వమని జగన్ ను ముఖేశ్ స్వయంగా కోరారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ... తమ పార్టీకి దక్కే ఏ పదవి అయినా ఇతరులకు ఇచ్చే సంస్కృతి ఇప్పటిదాకా లేదని, అయితే తన పార్టీలోని సీనియర్లతో చర్చించిన తర్వాతే దానిపై ఓ నిర్ణయానికి వస్తానని జగన్ చెప్పారని నత్వానీ వెల్లడించారు. ఇందుకోసం తనకు ఓ మూడు రోజుల సమయం కావాలని కూడా జగన్ చెప్పేశారట. సో... ముఖేశ్ స్వయంగా వచ్చి ఓ ప్రతిపాదన పెడితే... జగన్ మాత్రం అపర కుబేరుడినే వెయింటింగ్ లో పెట్టేశారన్న మాట.