Begin typing your search above and press return to search.
వైకాపా ఆఫీసును మారుస్తున్నారు!
By: Tupaki Desk | 22 July 2016 7:15 AM GMTతెలంగాణలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా.. ఏపీలో మాత్రం ప్రధాన - ఏకైక ప్రతిపక్ష హోదాలో ఉన్న వైకాపా ఆఫీసు - రాష్ట్రం విడిపోయి ఇంతకాలం అయినా హైదరాబాద్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. కారణాలు ఏవైనా కానీ... పరిపాలన హైదరాబాద్ నుంచి - ప్రజలు ఏపీలో అనే ఆలోచనకు చరమగీతం పాడిన టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇకపై విజయవాడ నుంచి పాలన కొనసాగించాలని నిర్ణయించుకుని ఆచరణలో పెట్టారు. అయితే ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా ప్రధాన కార్యాలయం మాత్రం భాగ్యనగరంలోనే ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ కూడా పార్టీ ఆఫీసుని విజయవాడలో ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు పార్టీ సీనియర్ లకు విజయవాడలో అనువైన ఆఫీసుని చూడాలని సూచినట్లుగా తెలుస్తోంది.
అయితే రాష్ట్రవిభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్ని పార్టీలు ఇప్పటికే విజయవాడ - గుంటూరుల్లో తమ తమ పార్టీ కార్యాలయాలను ఏర్పాటుచేసుకున్నారు. ఈ క్రమంలో "మనం కూడా బెజవాడకే వెళ్లిపోదాం.. అక్కడ ఆఫీసుకు ఏర్పాట్లు చూడండి" అంటూ పార్టీ సీనియర్లకు జగన్ సూచించారట! ఈ మేరకు పార్టీ నేతలతో సమావేశమైన జగన్ తమ పార్టీ ఆఫీసును విజయవాడకు మార్చాలని నిర్ణయించారని తెలుస్తోంది. అన్నీ అనుకూలంగా జరిగితే ఆగస్టులో వైకాపా ప్రధాన కార్యాలయం విజయవాడకు చేరిపోవచ్చు!