Begin typing your search above and press return to search.
జగన్ నిర్ణయం ఫైనల్..మరి వీళ్ళేం చేస్తారో ?
By: Tupaki Desk | 14 Jun 2022 11:30 PM GMTతన నిర్ణయం ఏమిటో జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా తేల్చిచెప్పేశారు. కాబట్టి ఇక నిర్ణయం తీసుకోవాల్సింది అసమ్మతి నేతలు మాత్రమే. ఇంతకీ విషయం ఏమిటంటే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీకి పార్టీలోనే యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ తరపున గెలిచిన వంశీ రాజకీయపరిణామాల కారణంగా చంద్రబాబునాయుడుకు దూరమైపోయారు. అప్పటినుండి వైసీపీకి సన్నిహితంగా ఉంటున్నారు.
అనధికారికంగా వంశీ వైసీపీ ఎంఎల్ఏగానే చెలామణి అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే యార్లగడ్డ-దుట్టా వర్గాలు వంశీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయి. దాంతో ప్రతిరోజు వీళ్ళమద్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. గడచిన వారంరోజులుగా వంశీ, వ్యతిరేక వర్గాల మధ్య గొడవలు రోడ్డునపడి పార్టీ పరువును తీస్తున్నాయి.
దాంతో జగన్ సీరియస్ అయ్యారు. వెంటనే వీళ్ళందరినీ పిలిచి పంచాయితీ సర్దుబాటు చేయాలని ఆదేశించారు. జగన్ ఆదేశాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై వర్గాలను పిలిచి మాట్లాడారు.
ఈ పంచాయితీలో భాగంగానే వంశీ చెప్పినట్లుగా నియోజకవర్గంలో అందరు నడుచుకోవాలని స్పష్టంగా ప్రకటించారు. అంటే వచ్చే ఎన్నికల్లో గన్నవరం టికెట్ వంశీకే అని చెప్పకనే జగన్ చెప్పినట్లయ్యింది. వీళ్ళ పంచాయితిలో మొత్తానికి జగన్ మాటేమిటో స్పష్టంగానే బయటకు వచ్చేసింది. మరి జగన్ చెప్పినట్లు యార్లగడ్డ, దుట్టా వర్గాలు వంశీతో కలిసి పనిచేస్తాయా ? లేకపోతే తమ పద్దతిలో తాము వెళతాయా ?
ఇదే సమయంలో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే యార్లగడ్డ తొందరలోనే టీడీపీలో చేరబోతున్నారట. వంశీ దూకుడును యార్లగడ్డ, దుట్టాలు తట్టుకోలేకపోతున్నది వాస్తవం. కాబట్టి జగన్ నిర్ణయాన్ని ఆమోదించి వంశీతో కలిసి పనిచేసే అవకాశాలు తక్కువనే అనుకోవాలి.
మరీ పరిస్ధితుల్లో ఏమిచేస్తారు ? చేసేందుకు ఏమీలేదు. పార్టీ మారటం ఒకటే వాళ్ళ ముందున్న ఆప్షన్. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత ఇపుడు వంశీతో సర్దుబాటు చేసుకుని పనిచేయలేరు. ఈ నేపధ్యంలోనే జగన్ తన నిర్ణయాన్ని ఫైనల్ చేసేశారు. మరి యార్లగడ్డ, దుట్టాలు ఏమి చేస్తారో చూడాలి.