Begin typing your search above and press return to search.

మరో కొత్త జిల్లా ఏర్పాటుకు జగన్ నిర్ణయం

By:  Tupaki Desk   |   5 April 2022 8:30 AM GMT
మరో కొత్త జిల్లా ఏర్పాటుకు జగన్ నిర్ణయం
X
ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ నూతన అధ్యాయనానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ సోమవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి వాటిని ప్రారంభించారు. దీంతోపాటు నిన్నటి నుంచే అన్ని జిల్లాల్లో పాలన సైతం ప్రారంభమైంది. ఏపీలో అంతకుముందు 13 జిల్లాలు ఉండగా.. మరో 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య మొత్తం 26కు చేరింది.

పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కలెక్టర్లు ఎస్పీలను సైతం నియమించింది. ఈ క్రమంలోనే మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందంటూ మంత్రి పేర్ని నాని మంగళవారం పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలన్నీ కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని నాని పేర్కొన్నారు. కొత్త జిల్లా ఏర్పాటుపై సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు.

26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. త్వరలోనే గిరిజన జిల్లా ఏర్పాటుకు సీఎం సీరియస్ గా ఆలోచిస్తున్నారని పేర్ని నాని తెలిపారు.

ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలు ఏర్పాటు చేశామని.. మరో జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. పాలనను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు 13గా ఉన్న జిల్లాలు ఇక నుంచి 26 గా రూపాంతరం కానున్నాయి. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవనుంది. అయితే కొత్త జిల్లాలుగా ఏర్పడిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న జిల్లాల రూపురేఖలు మారిపోయాయి. పునర్వవస్థీకరణలో భాగంగా కొన్ని మండలాలు, నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లాగా ఏర్పడడంతో ఇప్పటి వరకు ఉన్న ప్రధాన జిల్లాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఏపీలోని ప్రధాన జిల్లాల్లో ఒక్కటైన విశాఖపట్నం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మండలాలు, ఏజెన్సీ ప్రాంతాలు కలిగిన విశాఖ ఇప్పుడు కేవలం అర్భన్ ప్రాంతాలను మాత్రమే కలిగి రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా మారిపోయింది.