Begin typing your search above and press return to search.
జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్...ఫుల్ జోష్...?
By: Tupaki Desk | 6 April 2022 8:33 AM GMTసడెన్ గా జగన్ ఢిల్లీ టూర్ వేశారు అని అంతా అనుకుంటున్న మాట. కానీ అలా కాదు, జగన్ ఢిల్లీ వెళ్ళడం అంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగింది అంటున్నారు. దానికి ఉదాహరణగా చూడాలీ అంటే ప్రధాని నరేంద్ర మోడీ. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా అనేక మంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు వరసబెట్టి దొరకడమే అంటున్నారు. ఇక జగన్ కేవలం ఒక రోజు మాత్రమే ఢిల్లీలో ఉన్నారు.
కానీ చాలా మంది కేంద్ర మంత్రులను కలిశారు. గతంలో జగన్ ఢిల్లీ టూర్ లో ఎపుడూ ఇలా జరగలేదు. ఒకేసారి మోదీ, అమిత్ షాని కలవడం కూడా తక్కువ సార్లు జరిగింది. ఇక జగన్ ఈ ఏడాది మొదట్లో అంటే జనవరి 3న ఢిల్లీ వెళ్లారు. మళ్లీ మూడు నెలల సుదీర్ఘ విరామం తరువాత హస్తిన పయనం అయ్యారు.
ఈసారి ఆయన ప్రధాని మోడీతో గంట పాటు భేటీ వేశారు. ఆ తరువాత హోం మంత్రి అమిత్ షాతో కూడా సమావేశం అయ్యారు. మిగిలిన మంత్రులతో ఏపీ సమస్యలా మీద మాట్లాడినా మోడీ అమిత్ షాలతో మాత్రం జగన్ కేవలం దానికే పరిమితం కారు అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ రాజకీయ అంశాలు కూడా కచ్చితంగా చర్చకు వస్తాయని ఎవరైనా ఊహిస్తారు.
బీజేపీకి వైసీపీ రాజకీయ అవసరం ఉంది. అలాగే వైసీపీకి దాని అవసరాలు ఉన్నాయి. ఇలా రెండు పార్టీల నేతలూ కలసినపుడు చాలానే చర్చకు వస్తాయని అంటున్నారు. ముందు అర్జంటుగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు వైసీపీ మద్దతు కావాలి. బీజేపీకి బొటాబొటీ మెజారిటీ ఉంది. దాంతో వైసీపీ మద్దతు తులసీదళం అవుతుంది అంటున్నారు.
మరి దానికి వైసీపీ హామీ ఇచ్చేసినా ఆ పార్టీకి కూడా కావాల్సినవి ఉన్నాయి కదా. మూడు రాజధానుల విషయంలో కేంద్రం మద్దతు కావాలి. అలాగే ఏపీకి నిధులు కావాలి. పోలవరం తన హాయంలో పూర్తి చేసుకుంటే ఎన్నికల్లో జగన్ కి గట్టిగా లాభిస్తుంది. దీంతో పాటు ఏపీలో పవన్ని బీజేపీతోనే ఉంచేలా చూడాలి. అలా వీలు లేకపోయినా బీజేపీ మాత్రం టీడీపీ జట్టు కట్టరాదు.
ఇలాంటివి అన్నీ వైసీపీ మార్క్ రాజకీయాలు. మరి ఈ అంశాల విషయంలో కూడా క్లారిటీ ఏదో దొరికి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ మూడేళ్ల ముఖ్యమంత్రిత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టూర్ సక్సెస్ అయిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఏపీలో ఎవరెవరు కలసినా కేంద్రంలో బీజేపీ మద్దతు బాబుకు పోనీయకుండా చూడడంలో మాత్రం వైసీపీ సక్సెస్ అవుతోంది అనే అంటున్నారు. మొత్తానికి చూస్తే ఫుల్ జోష్ తోనే జగన్ ఢిల్లీ టూర్ చేసుకుని వచ్చారు అని అంటున్నారు.