Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌.. అందుకేనా.. వేడిత‌గ్గ‌ని ఏపీ పాలిటిక్స్‌..!

By:  Tupaki Desk   |   27 Dec 2022 5:30 PM GMT
జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌.. అందుకేనా.. వేడిత‌గ్గ‌ని ఏపీ పాలిటిక్స్‌..!
X
ఏపీ రాజ‌కీయాలు ఏమాత్రం వేడిత‌గ్గ‌డం లేదు. ఒక‌వైపు టీడీపీ.. మ‌రోవైపు వైసీపీలు ఏపీలో అధికారం ద క్కించుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏపీ రాజ‌కీయాల‌ను 90 డిగ్రీల సెల్సియ‌స్‌కు తీసుకువెళ్తున్నా యి. తాజ‌గా సీఎం జ‌గ‌న్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఏకంగా ఆయ‌న ప్ర‌ధాని మోడీతోనే చ‌ర్చ‌లు జ‌ర‌ప‌ను న్నారు. అయితే.. ఇదే ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌ను మ‌రింత ఘాటెక్కేలా చేసింది.

ఎందుకంటే.. రెండు ప్ర‌ధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాలు.. ప‌వ‌న్ దూకుడు, రెండు తెలంగాణ‌లో టీడీపీ వైఖ‌రి.. త‌ద్వారా టీడీపీ-బీజేపీ పొత్తు సంకేతాలు రావ‌డం ఈ రెండు అంశాల‌పైనే సీఎం జ‌గ‌న్ మోడీతో చ‌ర్చించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు.. బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. కానీ, క‌మ‌ల నాథులు పాత‌వి త‌వ్వుతున్నారు.

దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు ఈ ప్ర‌తిపాద‌న మొగ్గ విచ్చుకోవ‌డం.. ఆవెంట‌నే వాడిపోవ‌డం తెలిసిందే. కానీ.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు వేసిన పాచిక‌.. బీజేపీ నేత‌ల‌ను క‌దిలి స్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇటు నుంచి కాకుంటే అటు నుంచి న‌రుక్కువ‌స్తామ‌నే ధోర‌ణిలో చంద్ర‌బాబు తెలంగాణ‌లో స‌భ పెట్టి బీజేపీని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో భారీగా త‌ర‌లి వ‌చ్చిన జ‌నాభాతో బీజేపీ ఇప్పుడు టీడీపీతో చేతులు క‌లిపితే బెట‌ర్ అనే భావ‌న‌కు వచ్చింది.

ఇదే జ‌రిగితే.. ఏపీలోనూ బీజేపీ-టీడీపీ పొత్తుకు రెడీ కావొచ్చు. ఇది జ‌ర‌గ‌కూడ‌ద‌నేదే.. సీఎం జ‌గ‌న్ అభిప్రా యంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌ధాని మోడీతో భేటీ అయి.. ఏపీలో అవ‌స‌ర‌మైతే.. అవ‌గాహ‌నా ఒప్పందం చేసుకునేందుకు తాము రెడీ అని సీఎం జ‌గ‌న్ చెప్పే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇది క‌నుక స‌క్సెస్ అయితే.. ఎంపీ స్థానాల్లో కొన్ని బీజేపీకి ఇచ్చి.. ప‌రోక్షంగా టీడీపీకి , బీజేపీ మ‌ధ్య స‌ఖ్య‌త లేకుండా చేయా ల‌నే దానిపైనే సీఎంజ‌గ‌న్ చ‌ర్చించ‌నున్నారని అంటున్నారు.

ఇక‌, ప‌వ‌న్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయ‌డం కూడా సీఎం జ‌గ‌న్ టూర్‌లో మ‌రో కీల‌క అంశంగా ఉంద‌ని అంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న వైసీపీ ముక్త ఏపీ కోసం పాటు ప‌డ‌తాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో టీడీపీతో పొత్తుకు ఆయ‌న రెడీ అవుతున్నారు. అయితే.. ఈయ‌న‌ను కూడా నిలువ‌రించేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మరి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.