Begin typing your search above and press return to search.
టికెట్ ఇచ్చేందుకు 10 కోట్లు డిమాండ్ చేసిన జగన్!
By: Tupaki Desk | 26 Dec 2018 2:05 PM GMTఅవకాశం చిక్కినప్పుడల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై విమర్శలతో విరుచుకుపడుతుంటారు అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జగన్ అవినీతిపరుడని - ఆయనకు కుల పిచ్చి పట్టుకుందని పదేపదే విమర్శిస్తుంటారు. ఆయనపై ఉన్న కేసులను పదే పదే ప్రస్తావిస్తుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు పదేపదే ఇలా జగన్ పై జేసీ ధ్వజమెత్తుతుంటారన్నది కొందరి వాదన.
తాజాగా అనంతపురం వేదికగా టీడీపీ బుధవారం నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలోనూ జగన్ మీద తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకుపడ్డారు జేసీ. అయితే - తాజా సభలో జేసీ కేవలం విమర్శలతో ఆగిపోలేదు. సంచలన ఆరోపణలు కూడా చేశారు. వైసీపీ టికెట్ల కేటాయింపులో జగన్ వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
హిందూపురంలో వైసీపీ ఎమ్మెల్యే ఘని పార్టీ ఫిరాయించారు. టీడీపీలో చేరారు. దీంతో అక్కడ వైసీపీ టికెట్ కోసం నవీన్ నిశ్చల్ ప్రయత్నిస్తున్నారు. అయితే - నిశ్చల్ కు టికెట్ ఇచ్చేందుకు జగన్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారని ధర్మపోరాట దీక్ష వేదికగా జేసీ ఆరోపించారు. దీంతో ఏం చేయాలో తెలియక నిశ్చల్ తలపట్టుకున్నాడని చెప్పారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే రూ.10 కోట్లు అడిగితే... రాష్ట్రాభివృద్ధికి జగన్ ఎంత తీసుకుంటారో అంటూ ఎద్దేవా చేశారు.
కులం పేరు చెప్పుకొని ఎన్నికల్లో గెలుపొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారని కూడా జేసీ విమర్శించారు. కులం బువ్వ పెడుతుందా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ - చంద్రబాబుల కులమేంటని అడిగినోళ్లు మన రాష్ట్రంలో లేనే లేరని పేర్కొన్నారు. జగన్ మాత్రం కులాన్నే ఎన్నికల్లో ఓట్ల సాధనంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు.