Begin typing your search above and press return to search.
మోడితో విభేదించిన జగన్
By: Tupaki Desk | 25 March 2021 6:41 AM GMTఅవును, నరేంద్రమోడి సర్కార్ తెచ్చిన ఓ బిల్లును జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా విభేదించారు. ‘దేశ రాజధాని ప్రాంతం-ఢిల్లీ ప్రభుత్వం బిల్లు-2021’ ను రాజ్యసభలో వైసీపీ నూరుశాతం వ్యతిరేకించింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ అధికారాలను కత్తిరించేందుకు కేంద్రప్రభుత్వం ఈ బిల్లును తెచ్చింది. వరుసగా మూడోసారి అధికారంలో కంటిన్యు అవుతున్న కేజ్రీవాల్ ను ఓడించాలని మోడి ఎంతగా ప్రయత్నించినా సాధ్యంకాలేదు.
వివిధ రాష్ట్రాల్లో అదికారంలోకి రాగలుగుతున్న బీజేపీ ఢిల్లీలో మాత్రం శతవిధాల ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావటంలేదు. ఈ కారణంగా కేజ్రీవాల్ ప్రధానమంత్రి కంట్లో నలుసులాగ తయారయ్యారు. అందుకనే ఢిల్లీ ప్రభుత్వం అధికారాలకు కత్తెరలు వేసి లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) ను ముందు చూపించి వెనకనుండి కేంద్రమే అధికారాలను చెలాయించాలని అనుకున్నది. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నమే జరిగినా అప్పట్లో హైకోర్టు బాగా అక్షింతలు వేసింది.
కేజ్రీవాల్ వేసిన కేసువిషయమై హై కోర్టు జోక్యం చేసుకుని ‘లెఫ్ట్ నెంట్ గవర్నర్ దే అంతిమ నిర్ణయమైతే ఇక ఎన్నికలెందుకు ? అసెంబ్లీ ఎందుకు ? ప్రజా ప్రభుత్వం ఎందుకు’ ? అని కేంద్రాన్ని నిలదీసింది. దాంతో ఎల్జీ అధికారాల విషయంలో మోడి ప్రభుత్వం వెనక్కుతగ్గింది. ఇంతకాలానికి ఏకంగా పార్లమెంటులో బిల్లు పెట్టి మళ్ళీ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
లోక్ సభలో పాసైన ఈ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఈ బిల్లుపై విజయసాయిరెడ్డి మాట్టాడుతు కేంద్రం ప్రయత్నాలపై విరుచుకుపడ్డారు. అప్పట్లో హైకోర్టు అడిగిన ప్రశ్నలనే సభలో విజయసాయి లేవనెత్తరు. ముందు ముందు ఇదే పద్దతిని రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తారా అంటు సూటిగా ప్రశ్నించారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని ఓ ఎల్జీకి అధికారాలను ఎలా కట్టబెడతారంటూ మండిపడ్డారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వానికి అధికారాలు ఉండాలి తప్ప కేంద్రం నియమించిన వ్యక్తికి కాదన్నారు.
ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ కాదని ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే అని ఎంపి స్పష్టంగా చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లును తమ ముఖ్యమంత్రితో పాటు పార్టీ అంతా వ్యతిరేకిస్తున్నట్లు కూడా చెప్పారు. ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ విలువల విషయంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్ పేయ్ అనుసరించిన విధానాలను నరేంద్రమోడి కూడా అనుసరించాలంటు గట్టిగా చెప్పారు. మొత్తంమీద బీజేపీ ఏమి చేసినా గుడ్డిగా మద్దతివ్వకుండా అంశాల వారీగా మద్దతివ్వాలన్న జగన్ ఆలోచన బాగానే ఉంది.