Begin typing your search above and press return to search.
జగన్ కి కమ్మ ఓట్లతో పని లేదా...?
By: Tupaki Desk | 22 Sep 2022 11:30 PM GMTఏపీలో గతంలో ఎన్నడూ లేని చూడని రాజకీయం సాగుతోంది. గతంలో లేని విధంగా సమాజికవర్గాల మధ్య రాజకీయ యుద్ధం సాగుతోంది. ఒక విధంగా ఆధిపత్య పోరుకు ఇది క్లైమాక్స్ అని అనుకోవాలి. ఒక కులం ఇన్నాళ్ళూ పెత్తనం చేసిందని భావించి మరో కులం ఇపుడు తన హవా చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా కులలా మధ్య కీచులాటలు సాగుతూ కధ ముందుకు సాగుతుంటే అభివృద్ధి వెనక్కి పోతోంది.
ఏపీలో ఒక వింత విచిత్రం ఇపుడు అంతా చూస్తున్నారు. ఫలానా అంటూ కొన్ని కులాలను కావాలని పక్కన పెడుతున్నారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. అది ఎంతదాకా వెళ్తోంది అంటే చరిత్ర పుటలలోకి వెళ్లి పాత పేజీలను చించాలనుకోవడం అనే కుసంస్కృతి దాకా అని చెప్పాలి.
చిత్రమేంటి అంటే ఏపీ రాజకీయాల్లో గత నాలుగు దశాబ్దాలుగా తీసుకుంటే అయితే కమ్మ లేకపోతే రెడ్డి ఎక్కువగా ముఖ్యమంత్రులు అయ్యారు. ఏపీ విభజన తరువాత చూస్తే తొలి సీఎం చంద్రబాబు అయ్యారు. ప్రస్తుతం జగన్ సీఎం గా ఉన్నారు. అయితే ఏ సామాజిక వర్గం సీఎం గా ఉన్నా అరవై ఏళ్ళ ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో కమ్మ వారికి కీలక శాఖలతో పాటు మంత్రి పదవులు బాగానే దక్కేవి.
అలాంటిది జగన్ సీఎం అయ్యాక తొలిసారి మంత్రివర్గంలో కొడాలి నానికి చాన్స్ ఇచ్చారు. అయితే మలి విడత విస్తరణలో ఆయనకు బెర్త్ లేకుండా చేశారు. దీంతో ఇది వింత అయిన కూర్పుగా అనిపించింది. కమ్మలు ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. రాజకీయాలను మలుపు తిప్పారు. అలాంటి వారికి ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా జగన్ చేయడం పట్ల ఆ సామాజికవర్గం రగిలిపోతోంది.
ఇక దీనికంటే ముందు మూడు రాజధానులు అంటూ జగన్ సర్కార్ తెచ్చిన కొత్త కాన్సెప్ట్ అమరావతి రాజధానికి యాంటీగా తీసుకున్నది అని అంతా అంటారు. అమరావతిని కేవలం కమ్మ సామాజికవర్గానికే పరిమితం చేస్తూ వైసీపీ విపక్షంలో ఉన్నపుడు చేసిన ప్రచారం కూడా ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టేలాగానే సాగింది. అయితే అమరావతికి కట్టుబడి ఉంటామని చెప్పి ఓట్లు తీసుకున్న వైసీపీ తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం మాట మార్చడం వెనక సామాజిక సమరమే కారణం అని అంటున్నారు.
ఇక విజయవాడ జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టి, కమ్మలలో కొందరికి నానినేటెడ్ పదవులు ఇచ్చిన జగన్ ఆ తరువాత కాలంలో మాత్రం ఏపీలో సామాజిక లెక్కలను తీసుకుని కొందరిని మంత్రులుగా తప్పించారు అని చెబుతారు. అలా కమ్మలతో పాటు రాజులకు ఈ తడవ చాన్స్ దక్కలేదు. ఇక బ్రాహ్మణులు మొదటి నుంచి ఒక్క మంత్రి పదవిని కూడా పొందలేకపోయారు. అదే టైం లో వారి వద్ద మూడేళ్ళుగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇపుడు లేకుండా చేశారు. వైశ్యులకు తొలి విడతలో మంత్రి పదవి ఇచ్చి మలి విడతలో ఉత్త చేతులు చూపించారు. ఇపుడు మొక్కుబడిగా డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చారు.
ఇలా ప్రధాన సామాజిక వర్గాలను అగ్ర కులాలను జగన్ దూరం పెట్టడం మీద చర్చ అయితే గట్టిగా సాగుతోంది. ఈ నేపధ్యంలో ఎన్టీయార్ వర్శిటీకి అన్నగారి పేరుని తప్పించి తన తండ్రి గారి పేరుని జగన్ పెట్టడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. అయితే తమకు ఎటూ కమ్మ సహా కొన్ని సామాజిక వర్గాల ఓట్లు ఈసారి పడవు అని వైసీపీ పెద్దలు ముందే నిర్ణయించుకుని ఈ రకమైన సాహసాన్ని చేస్తున్నారా అన్న చర్చ ఉంది.
అయితే ఒకే కులం ఓట్లతోనే ఎవరూ నెగ్గరు. అలాగే ఒక కులం ఓట్లను దూరం చేసుకోవాలనుకుంటే వారు మాత్రమే దూరం కారు, చాలా మంది ఇతరులు కూడా దూరం అవుతారు. ముఖ్యంగా ఏ కులం, ప్రాంతం రాజకీయం అంటని తటస్థులు అయితే ఈ విషయంలో కచ్చితంగా సరైన సమయంలో స్పందిస్తే మాత్రం అది అధికార పార్టీకే ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.