Begin typing your search above and press return to search.

తెలంగాణతో ఫైట్ వద్దనుకుంటున్న జగన్

By:  Tupaki Desk   |   8 July 2021 2:30 PM GMT
తెలంగాణతో ఫైట్ వద్దనుకుంటున్న జగన్
X
మొత్తానికి ఏపీ సీఎం జగన్ తెలంగాణతో నీటి ఫైట్ వద్దనుకుంటున్నట్టు తాజా మాటలను బట్టి అర్థమవుతోంది. పక్క రాష్ట్రాలతో సయోధ్య కోరుకుంటున్నట్టు జగన్ తాజాగా వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. రైతు దినోత్సవంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని జగన్ అన్నారు. ఏ రాష్ట్రంతోనూ విభేదాలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని.. అన్నిరాష్ట్రాలతో సఖ్యతతో ఉండాలనే కోరుకుంటున్నట్టు జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి తెలంగాణతో నీటి వివాదాలు వద్దని జగన్ హింట్ ఇచ్చినట్టు అయ్యింది.

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. గతంలో సీమ, కోస్తా, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా ఉందనే విషయం తెలిసిందే కదా అని జగన్ అన్నారు. ఉమ్మడి ఏపీ కేటాయింపుల్లో భాగంగానే తెలంగాణకు 290 కేటాయింపులు చేశారని జగన్ చెప్పుకొచ్చారు. సీమ ఎత్తిపోతలకు నీళ్లు వాడుకుంటే తప్పేముందని.. తెలంగాణ కల్వకుర్తి సామర్థ్యాన్ని పెంచి చేపడుతున్నారని అది తప్పు కాదా? అనిప్రశ్నించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణకు కేంద్రం 2015 జూన్ లో నీటి కేటాయింపులు జరిపిందని జగన్తెలిపారు. 881 అడుగుల నీటి మట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లురావని.. గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకు పైగా నీళ్లు 20-25 రోజులకు మించి లేవని జగన్ తెలిపారు. తెలంగాణ మాత్రం 796 అడుగుల వద్దే విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. 800 అడుగులలోపే నీళ్లు తీసుకుంటోందని జగన్ వాస్తవాలు చెప్పుకొచ్చారు.

ఇక గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గాడిదలు కాశారా? అని జగన్ విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి, దిండి ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీ కూడా చంద్రబాబు హయాంలో కడుతుంటే మీరు గాడిదలు కాస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన పాపమే ఈ నీటి సమస్య అని నిలదీశారు. రైతుల కోసం నీటి రాజకీయాలు చేయవద్దని జగన్ సూచించారు.

పక్కరాష్ట్రాలతో సత్యంబంధాలు కోరుకుంటున్నామని..పాలకుల మధ్య సఖ్యత ఉండాలని కోరుకుంటున్నానని జగన్ అన్నారు. భైరవాని తిప్ప ప్రాజెక్టుకు యుద్ధప్రాతిపదికన భూసేకరణ చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించామని జగన్ తెలిపారు. ప్రాజెక్టు కోసం 1400 ఎకరాల భూసేకరణ జరగాలని.. కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లోనూ తాము జోక్యం చేసుకోమని జగన్ స్పష్టం చేశారు.