Begin typing your search above and press return to search.
జగన్ ఎఫెక్ట్: టీడీపీలో ఆ విషయంపై తర్జన భర్జన!
By: Tupaki Desk | 24 March 2021 1:30 AM GMTఏపీ సీఎం జగన్ ఎఫెక్ట్ పనిచేస్తే.. తమకు కష్టాలు తప్పవా ? కేంద్రం ఈ విషయంలో ఎలా ముందుకు సాగుతుంది ? ఇదీ .. ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న అంతర్గత చర్చ. మరి ఆ ఎఫెక్ట్ ఏంటి ? అనేది చర్చకు దారితీస్తోంది. దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఏపీకి చెందిన ప్రస్తుత సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు అవకాశం వస్తోంది. ప్రస్తుతం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎస్ ఏ బోబ్దే.. వచ్చే నెల 23న రిటైర్ కానున్నారు. ఈ క్రమంలో ఇప్పుడున్న వారిలో సీనియర్లను ఆయన చీఫ్ జస్టిస్ పదవికి సిఫారసు చేయాల్సిన అవసరం ఉంది.
సీనియార్టీ ప్రకారం చూస్తే.. జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ వరుసలో ముందున్నారు. ప్రస్తుత సీజే బాబ్డే జస్టిస్ ఎన్వీ రమణ పేరును తదుపరి సీజేగా ప్రతిపాదిస్తారని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కేంద్రం కూడా సుప్రీంకోర్టు కొలీజియానికి ఆయన పేరును పంపించక తప్పదు. అప్పుడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ పేరు ఖరారయ్యే అవకాశముంది. జస్టిస్ రమణ సీజే పదవి చేపడితే ఆయన ఏకంగా 16 నెలల పాటు ఆ పదవిలో ఉంటారు. ఇది టీడీపీకి ఎంతో అవసరమైన అంశంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏపీలో జగన్ సర్కారు దూకుడుకు ఒకింత ముకుతాడు వేసేందుకు తమకు అవకాశం చిక్కుతుందని భావిస్తోంది.
అయితే. జస్టిస్ ఎన్వీ రమణ సీజే అయ్యేందుకు ఉన్న ఏకైక అడ్డంకి ఏదైనా ఉంటే అది ఏపీ ముఖ్యమంత్రి జగన్. జస్టిస్ ఎన్వీరమణపై ఆరోపణలు చేస్తూ.. ఏకంగా.. ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడమే. ఆయన బంధువులు రాజధాని అమరావతిలో భూములు కొన్నారని.. వీటిని విచారిస్తుంటే.. అడ్డుపడుతున్నారని.. ప్రతి పక్ష నేతలకు సాయం చేస్తున్నారని.. తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారని.. ఇలా అనేక అంశాలను పేర్కొంటూ.. జస్టిస్ రమణపై లేఖను సంధించారు సీఎం జగన్. వీటిని నేరుగా ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు అందించడంతో పాటు.. మీడియాకు కూడా లీక్ చేశారు.
కొన్నాళ్ల కిందట దీనిపై పెద్ద ఎత్తున రచ్చసాగింది. ఇక, ఇప్పుడు సైలెంట్ అయిపోయినప్పటికీ.. ఇప్పుడు సీజే ఎంపిక ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది? జగన్ ఎఫెక్ట్ పనిచేస్తుందా? జస్టిస్ ఎన్వీరమణకు అవకాశం వస్తుందా? రాదా? అనే అంశాలు టీడీపీలో చర్చకు దారితీస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.