Begin typing your search above and press return to search.
మహిళలే టార్గెట్.. జగన్ ఎన్నికల వ్యూహం?
By: Tupaki Desk | 23 Sep 2022 2:30 PM GMTతాజాగా సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన చేసిన ప్రసంగాన్ని గమనిస్తే.. మహిళలనే టార్గటె్‌గా చేసుకుని.. ముందుకు వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా.. జగన్ ప్రతిమాట వెనుక.. ఎన్నికల వ్యూహం దాగి ఉందని చెబుతున్నారు. జనవరి నుంచి పింఛను పెంచుతున్నట్లు వెల్లడించడం.. ఖచ్చితంగా వ్యూహాత్మకమేనని అంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మూడో విడత వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభోత్సవంలో పింఛను పెంచనున్నట్లు ప్రకటించారు.
తమది మహిళల ప్రభుత్వమని జగన్ అన్నారు. మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోందని తెలిపారు. అమ్మఒడి ద్వారా అక్కాచెల్లెళ్లకు తోడుగా నిలబడ్డామని వెల్లడించారు. ఈ మూడేళ్లలో మహిళలకు రూ.లక్షా 17వేల కోట్లు అందించామని గుర్తు చేశారు. ఎక్కడా లంచాలు, మధ్యవర్తులు లేకుండా, వివక్ష చూపకుండా పథకాలు అందించామన్నారు. వచ్చే జనవరి నుంచి పింఛను రూ.2,750కు పెంచుతున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వాలకు, తమకు తేడా గమనించాలని మహిళలను కోరారు.
"వచ్చే జనవరి నుంచి పింఛను రూ.2,750 కు పెంపు. మాది మహిళల ప్రభుత్వం.. వారి జీవితాల్లో మార్పు వస్తోంది. అమ్మఒడి ద్వారా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచాం. 4 పథకాల ద్వారా మహిళలకు రూ.51 వేల కోట్లు ఇచ్చాం. మూడేళ్లలో మహిళలకు రూ.లక్షా 17 వేల కోట్లు అందించాం. నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకే ప్రభుత్వ సాయం. ఎక్కడా లంచాలు లేవు.. మధ్యవర్తులు లేరు.. వివక్ష లేదు.`` అని వ్యాఖ్యానించారు.
తమ పాలనలో ఎస్సీ, బీసీ మహిళల జీవితాల్లో మార్పు వచ్చిందని సీఎం జగన్ అన్నారు. మూడేళ్లలో చేయూత ద్వారా రూ.14,110 కోట్లు సాయం చేశామని గుర్తు చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా 39 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు.
ఈ కామెంట్లను గమనిస్తే.. ఖచ్చితంగా సీఎం జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టే కనిపిస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటి వరకు సంక్షేమం మాత్రమే నమ్ముకున్న జగన్.. ఆదిశగా మహిళా ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలను రాబోయే రోజుల్లో ముమ్మరం చేసినా ఆశ్చర్యంలేదని పరిశీలకులు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.