Begin typing your search above and press return to search.
ఆంధ్రాలో ముద్దులు కథమ్.. తెలంగాణలో షురూ!?
By: Tupaki Desk | 20 March 2022 3:30 PM GMTఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో విభేధించిన ఆయన సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపింది. ఏపీ లో అన్న వైఎస్ జగన్ పార్టీలో ప్రాధాన్యత నివ్వకపోవడంతో తనతో విభేధించి బయటికి వచ్చిన వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని ప్రారంభించి అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.
తెలంగాణలో ఎలాగైనా తన ఉనికిని చాటుకోవాలని వైఎస్ షర్మిల తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కారణంగానే గడిచిన ఏడేళ్లలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శిస్తూ తెలంగాణ పల్లెల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రని మొదలుపెట్టింది. 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్రని తెలంగాణ వ్యాప్తంగా కొనసాగించాలని నిర్ణయించుకున్న షర్మిల ప్రజాప్రస్థాన యాత్రని మొదలుపెట్టింది. బుధవారం ఈ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం గోకారంచ వర్కట్ పల్లి సంగెం గ్రామాల్లో సాగింది.
గోకారం వరకు 300 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ కేసీఆర్ ని నియంతలా అభివర్ణిస్తూ తెలంగాణ సమాజాన్ని ఆకర్షించడానికి పడరాని పాట్లు పడుతోంది. తెలంగాణలో మళ్లీ రాజన్న పాలన తీసుకురావడమే తన పార్టీ ప్రధాన లక్ష్యమని చెబుతూ ప్రాచారం చేస్తున్న షర్మిల ముద్దులతో ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.
షర్మిల మాటలు, చేతలు చూస్తున్న తెలంగాణ జనం ఆస్కార్ కు మించిన అవార్డ్ ఏదైనా వుంటే అది ఖచ్చితంగా షర్మిలకే ఇవ్వాలని తామంతా పోరాటం చేస్తామని, అన్నకు తగ్గ చెల్లిగా ముద్దుల విషయంలో షర్మిల పేరు తెచ్చుకుంటోందని తెలంగాణ ప్రజలు సెటైర్లు వేస్తున్నారట. ఏపీ ఎన్నికల వేళ రోడ్ షో నిర్వహించిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుదుటిపై ముద్దులు పెడుతూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
ఓ దశలో ఓ ముసలవ్వకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా ఏకంగా వైఎస్ జగన్ కే ముద్దు పెట్టడం అప్పట్లో వైరల్ గా మారింది. అదే పంథాని పాటిస్తూ తెలంగాణ లో ప్రజాప్రస్థాన పాదయాత్ర పేరుతో షర్మిల చేస్తున్న పాదయాత్రపై తెలంగాణ ప్రజలు సెటైర్లు వేస్తుండటం నెట్టింట వైరల్ గా మారుతోంది. ఆంధ్రాలో ముద్దులు కథమ్.. తెలంగాణలో షురూ అని షర్మల పాదయాత్రని గమనిస్తున్న వారు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా వైఎస్ షర్మిల తన పాదయాత్రలో భాగంగా పర్యటిస్తూ ఓ పెద్దాయన నుదిటిపై ముద్దు పెడుతున్న ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.