Begin typing your search above and press return to search.

ఆధారాల‌తో స‌హా లీకేజీని వివ‌రించిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   28 March 2017 9:57 AM GMT
ఆధారాల‌తో స‌హా లీకేజీని వివ‌రించిన జ‌గ‌న్‌
X
అధికార టీడీపీ నేత - ఏపీ మంత్రి నారాయ‌ణకు చెందిన నారాయణ హైస్కూల్‌ లో టెన్త్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారాన్ని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బయటపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్ర‌స్తావిస్తూ సభలో ఆయన డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నివేదిక చూపించారు. ఇందుకు బాధ్యులైన మంత్రులు నారాయణ - గంటా శ్రీనివాసరావులను భర్తరఫ్‌ చేయాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. దీంతో స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన‌డం ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల వంత‌యింది. అవినీతిని బ‌య‌ట‌పెడుతూంటే మైక్ క‌ట్ చేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. వైఎస్‌ జగన్‌ కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పలుమార్లు వెల్‌ లోకి దూసుకెళ్లి వైఎస్‌ ఆర్‌ సీపీ సభ్యులు నిరసన తెలపడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను మూడోసారి స్పీకర్‌ వాయిదా వేశారు.

మ‌రోవైపు ప‌రీక్షా ప‌త్రాల లీకేజీ వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌ ల వల్లే నారాయణ కాలేజ్‌ కు ర్యాంక్‌ లు వస్తున్నాయని అనుమానం వ్య‌క్తం చేశారు. పేపర్‌ లీక్‌ కు తమకు సంబంధం లేదని మంత్రి నారాయణ మీడియా పాయింట్‌ లో మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నిజంగా మంత్రులు - ముఖ్యమంత్రి తప్పుచేయలేదనుకుంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు ఎవరు తప్పు చేశారో తెలుస్తుందని వారిని శిక్షించి మీ సశ్చిలతను నిరూపించుకోవాలని ముఖ్యమంత్రిని సూచించారు. దొంగలెవరూ దొంగతనం చేశామని ఒప్పుకోరని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులు తిండి తిప్పలు మానేసి అహర్నిషలు కష్టపడి చదువుతుంటే లీక్‌ లు చేసుకుంటే నారాయణ కళాశాల ర్యాంకులు కొట్టుస్తుందని పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. నెల్లూరులో పేపర్‌ ఎందుకు లీక్‌ అయ్యిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. లీకేజీల‌పై నేరుగా స‌మాధానం చెప్ప‌లేక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో ఎదురుదాడికి దిగేలా సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించ‌డం దౌర్భ‌గ్య‌మ‌ని పుష్పశ్రీవాణి అన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/