Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఆస్తుల లెక్క ఇదే!

By:  Tupaki Desk   |   23 March 2019 8:07 AM GMT
జ‌గ‌న్ ఆస్తుల లెక్క ఇదే!
X
ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఆస్తుల వివ‌రాల్ని వెల్ల‌డించారు. పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతున్న ఆయ‌న తాజాగా త‌న నామినేష‌న్ ను దాఖ‌లు చేశారు. దీని ప్ర‌కారం జ‌గ‌న్ త‌న స్థూల ఆస్తుల విలువ రూ.339.89 కోట్లుగా వెల్ల‌డించారు. వీటికి అద‌నంగా ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆస్తులుగా చెప్పాలి.

త‌న నామినేష‌న్ లో జ‌గ‌న్ త‌న ఆస్తులు.. అప్పుల‌తో పాటు..త‌న కుటుంబ స‌భ్యుల ఆస్తుల వివ‌రాల‌తో కూడిన 47 పేజీల సుదీర్ఘ అఫిడ‌విట్ ను స‌మ‌ర్పించారు. వీటిల్లో పేర్కొన్న దాని ప్ర‌కారం జ‌గ‌న్ చేతిలో ఉన్న న‌గ‌దు కేవ‌లం రూ.43,560 మాత్ర‌మే. అదే స‌మ‌యంలో ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి చేతిలో ఉన్న క్యాష్ రూ.49,390గా పేర్కొన్నారు.

జ‌గ‌న్ త‌న‌కున్న బ్యాంకు డిపాజిట్లు.. పెట్టుబ‌డుల గురించి పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో త‌న స‌తీమ‌ణికి చెందిన బ్యాంకు ఖాతాల వివ‌రాల్ని వెల్ల‌డించారు. వాటి ప్ర‌కారం చూస్తే.. జ‌గ‌న్ కు బెంగళూరులోని ఓరియంటల్‌ బ్యాంకుఆఫ్‌ కామర్స్‌లో రూ.20,20,083, అక్కడే మరో ఖాతాలో రూ.1,25,32,855, హైదరాబాద్‌ సచివాలయం ఎస్‌బీఐలో రూ.21,44,746, మల్కాజిగిరి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.25వేలు ఉన్నాయి.

జ‌గ‌న్ స‌తీమ‌ణి భారతికి బెంగళూరు బసవేశ్వరనగర్‌లోని యాక్సిస్‌ బ్యాంకు ఖాతాలో రూ.9,69,686, అక్కడే మరో ఖాతాలో రూ.17,41,087 ఉన్నాయి. కోరమంగళలోని ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో రూ.5,73,701.. ఇక్కడే మరో ఖాతాలో రూ.20,90,821 ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓబీసీ బ్యాంకులో రూ.8.09,884, పులివెందుల ఎస్‌బీఐలో రూ.21,37,480 ఉన్నట్లు చూపించారు. యాక్సిస్‌ బ్యాంకు ట్రావెల్‌ కార్డు కింద రూ.1,09.500గా పేర్కొన్నారు.

జ‌గ‌న్ .. భార‌తిల పెట్టుబడుల విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్ కు భార‌తి సిమెంట్స్ తో స‌హా 13 కంపెనీల్లో పెట్టుబడులు, ఈక్విటీ షేర్లు మొత్తం రూ.317,45,99,618గా ఉన్నట్లు చూపించారు.అదే స‌మ‌యంలో జ‌గ‌న్ స‌తీమ‌ణి భారతికి: వివిధ కంపెనీల్లో పెట్టుబడులు, షేర్లు రూ.62,35,01,849 ఉన్నట్లు పేర్కొన్నారు. జ‌గ‌న్ పేరుతో ఎలాంటి ఆభ‌ర‌ణాలు లేవు. అయితే.. ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి పేరుతో మాత్రం రూ.3,57,16,658 విలువజేసే ఆభరణాలు. ఆయ‌న పెద్ద కుమార్తె హర్షిణి పేరుతో రూ.3,16,13,435 ఆభరణాలు.. చిన్న‌కుమార్తె వర్షా పేరుతో రూ.3,12,46,415 ఆభర ణాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

వాహ‌నాల విష‌యానికి వ‌స్తే..

+ 2007లో బీఎండబ్ల్యూ ఎక్స్‌5

+ 2009లో మూడు స్కార్పియోలు

ఈ వాహ‌నాల‌కు తాను ఎలాంటి డ‌బ్బు చెల్లించ‌లేద‌ని.. కానీ త‌న పేరుతో మాత్ర‌మే ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

స్థిరాస్తుల విష‌యానికి వ‌స్తే..

జ‌గ‌న్ త‌న స్థిరాస్తుల ఖాతాలో హైద‌రాబాద్ లోని లోటస్‌పాండ్‌, బెంగళూరులోని ఇళ్లకు సంబంధించిన వివరాలను పొందుపరచలేదు. ఇటీవలే గుంటూరు జిల్లా తాడేపల్లిలో గృహప్రవేశం చేసిన ఇంటికి సంబంధించిన వివరాలను మాత్రం అఫిడవిట్‌లో తెలిపారు.

ఆస్తుల‌తో పాటు త‌న‌కున్న అప్పుల్ని వెల్ల‌డించారు. త‌న‌కు రూ.1,19,21,202 అప్పున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రూ.5,80,584 అని చెప్పారు. ఇక‌.. వివాదంలో ఉన్న అప్పులు తన పేరిట రూ.66 కోట్లు, తన భార్య పేరిట రూ.6.75కోట్లు ఉన్నట్లు తెలిపారు.

జగన్‌ పేరిట ఇడుపులపాయలో రూ.42.44లక్షల విలువ చేసే 42.44 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయేతర భూమి కింద పులివెందుల మండలం భాకరాపురంలో రెండు వేర్వేరు సర్వేనెంబర్లలో రూ.8,42,39,232 విలువ 4,51,282 చ.గజాల స్థలం చూపించారు. బంజారాహిల్స్‌ రోడ్‌నెం.2లో రూ.14,46,33,560 విలువ వాణిజ్య భవనం ఉండగా, సాగర్‌సొసైటీలో, పులివెందుల మండలంలోని భాకరాపురంలో రూ.11,99,59,582 విలువ నివాసిత భవనాలు రెండు ఉన్నాయి.

వైఎస్‌ భారతి పేరుతో ఉన్న భూములు చూస్తే..

+ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో తొమ్మిదెకరాలు, ఉడిపి జిల్లాలో 37సెంట్లు.

+ పులివెందుల మండలంలోనే మొత్తం 10చోట్ల రూ.7,17,41,262 విలువైన వ్యవసాయేతర భూమి.

+ పులివెందుల, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గంలో రూ.10,25,45,015 విలువైన వాణిజ్య భవనాలున్నాయి.

+ పులివెందులలో ఇంటితో పాటు.. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రూ.13,89,51,648 మార్కెట్‌ విలువజేసే రెండు విల్లాలు ఉన్న‌ట్లు తెలిపారు.

ఒప్పందాల విష‌యానికి వ‌స్తే.. 24 ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌తో భార‌తి సిమెంట్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ కాంట్రాక్టు కుదుర్చుకుంటే.. తెలంగాణ ట్రాన్స్ కోతో స‌రస్వ‌తి ప‌వ‌ర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉన్న‌ట్లు పేర్కొన్నారు.