Begin typing your search above and press return to search.
డ్రామానాయుడు ఇక చాలు..అసెంబ్లీలో జగన్ ఫైర్!టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
By: Tupaki Desk | 3 Dec 2020 10:00 AM GMTటీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై అసెంబ్లీలో సీఎం జగన్ ఫైర్ అయ్యారు. రామానాయుడు పచ్చి అబద్ధాలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రామానాయుడు సభలో మాట్లాడకుండా అతడిపై ప్రివిలేజ్మోషన్ (సభాహక్కుల తీర్మానం) ప్రవేశపెట్టాలని సీఎం జగన్ స్పీకర్ ను కోరారు. ఏపీలో శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గురువారం అధికార - ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పింఛన్లపై రామానాయుడు మాట్లాడుతూ.. సీఎం జగన్ మాట తప్పారని పేర్కొన్నారు. ఈ విషయంపై తొలుత మంత్రి కొడాలి నాని స్పందించారు.
ఆ తర్వాత సీఎం జగన్ జోక్యం చేసుకొని రామానాయుడు తీరును తప్పుపట్టారు. ఆయన రామానాయుడు కాదు డ్రామానాయుడు అంటూ ఎద్దేవా చేశారు. రామానాయుడు పచ్చి అబద్ధాలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గతంలో సీఎం జగన్ ఇచ్చిన మాటలను అసెంబ్లీలో వీడియోలు ప్రదర్శించారు. ఉద్దేశపూర్వకంగా సభను తప్పు దోవ పట్టిస్తున్న రామానాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కోరుతుమన్నారు.
ఆ తర్వాత సభా నాయకుడి సూచన మేరకు టీడీపీ సభ్యుడు రామానాయుడిపై సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి చర్యలు కొనసాగుతాయని స్పీకర్ తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.. స్పీకర్ పోడియం వైపు దూసుకొచ్చారు. దీంతో 8 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. అచ్చెన్నాయడు - రామకృష్ణబాబు - మంతెన రామరాజు - సత్యప్రసాద్ - వీరాంజనేయులు - బెందాళం అశోక్ - జోగేశ్వరరావు తదితరులను స్పీకర్ సస్పెండ్ చేశారు.