Begin typing your search above and press return to search.
జగన్ ఆవేదన నిజమేనా?
By: Tupaki Desk | 31 Aug 2015 9:19 AM GMTఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలి రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా కలత చెందారు. ప్రతిపక్ష నేత అయిన తనను సంతాప తీర్మానంపై మాట్లాడనివ్వలేదని ఆరోపించారు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలను స్పీకర్ మాట్లాడుతున్నారని వాపోయారు. తాము పోరాడుతున్నది చంద్రబాబు పైనా...స్పీకర్ పైనా అర్థం కావడం లేదన్నారు. తమకు కావాలనే సభలో మైక్ ఇవ్వడం లేదన్నారు.
ప్రతిపక్ష పార్టీకి సభలో ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. మరోవైపు పచ్చచొక్కాలు వేసుకుంటే తప్ప కెమెరాలకు తమ సభ్యులు కనిపించరేమో అంటూ ఎద్దేవా చేశారు. సంతాప తీర్మానం గురించి మాట్లాడుతుంటే కూడా మైక్ ఇవ్వకపోవడం ఏం పద్దతి అంటూ జగన్ నిలదీశారు.
పభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీని కూడా మాట్లాడనీయకుండా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అధికార సభ్యులు మండిపడటం, తదితర విషయాలు పక్కనపెడితే...జగన్ గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ దాదాపు ఇదే తరహా వాదన వినిపించారు. సభలో ప్రతిపక్షం గొంతునొక్కుతున్నారని ఆరోపించారు. తమను స్పీకర్ కావాలనే తక్కువ చేసి చూస్తున్నారని..సరిపడా సమయం ఇవ్వడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇపుడు కూడా అదే తరహా డిమాండ్ రావడం, పరిస్థితులు ఎదురుకావడం చూస్తుంటే... జగన్ కావాలనే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారా లేక నిజంగానే సభలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా అనేది ఆలోచించవలసిన విషయమేనేమో.