Begin typing your search above and press return to search.
జగన్ దూకుడేం తగ్గనట్లుందే!
By: Tupaki Desk | 10 March 2016 10:40 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సందర్భం ఏదైనా అధికార - ప్రతిపక్షాలు తమదైన శైలిలో స్పందనలు మొదలు పెడుతున్నాయి. ప్రతిపక్ష నేత జగన్ తో పాటు ఆయన పార్టీ నేతలు ప్రభుత్వంపై ఒకింత దూకుడుగానే వెళుతున్నారు. ఎన్నికల హామీలు మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల వరకు వైసీపీ నేతలు టార్గెట్ గవర్నమెంట్ అన్నట్లుగా ముందుకు వెళ్లడం స్పష్టంగా కనిపించింది.
ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. ప్రతి సంవత్సరం ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల భృతి కల్పిస్తామని ఎన్నికల సమయంలో చెప్పినా ఆ దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. ఒప్పంద ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని, వారిని పలు విధాలుగా వేధిస్తూ తొలగిస్తున్నారని ఆరోపించారు.
సభలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ తెలుగుదేశం హామీలను ఎద్దేవా చేశారు. జాబు రావాలంటే.. చంద్రబాబు అధికారంలోకి రావాలని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారని, అయితే బాబు వచ్చారు కానీ జాబులు మాత్రం రాలేదని విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో నిరుద్యోగంపై చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి కల్పిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించినా ఆ హామీని అమలుచేయలేదన్నారు. డీఎస్సీ నిర్వహించి 18 నెలలు గడిచినా మెరిట్ లిస్ట్ కోసం అభ్యర్థులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇదేనా చంద్రబాబు సంక్షేమ రాజ్యం అని నిలదీశారు. సామాజిక పింఛన్ల మంజూరులో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని జగన్ విమర్శించారు. టీడీపీ పాలనలో పింఛన్ల సంఖ్య తగ్గిందన్నారు. మార్చి నాటికి ప్రభుత్వం 39,27,657 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. పింఛన్లపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు జగన్ తెలిపారు.