Begin typing your search above and press return to search.

రుణ‌మాఫీపై దిమ్మ‌తిరిగే లెక్క‌లు చెప్పిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   22 March 2017 8:52 AM GMT
రుణ‌మాఫీపై దిమ్మ‌తిరిగే లెక్క‌లు చెప్పిన జ‌గ‌న్‌
X
అన్నదాత‌ల సంక్షేమం విష‌యంలో ప్ర‌భుత్వం చెప్పిన అంశాల ఆధారంగానే ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేశారు. అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై జగన్‌ మాట్లాడుతూ.. రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారన్న అంశంపై చర్చ జరుగుతుండగా, మంత్రి వక్రీకరిస్తు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. రుణమాఫీ కింద ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు వడ్డీకే సరిపోవడం లేదని విమర్శించారు. బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి రైతు ధర్మశ్రీ పేరు ఉటకరించారని గుర్తు చేసిన జ‌గ‌న్ విష‌యంలో అస‌లు నిజాల‌ను స‌భ ముందుకు తీసుకువ‌చ్చారు.

"ధర్మశ్రీ అనే రైతు 4.2.214న రూ.50 వేలు సోసైటీ నుంచి అప్పు తీసుకున్నారు. ఈయనకు ప్రభుత్వం ఇచ్చిన మొదటి ధపాకు రూ.6200 వడ్డీకి సరిపోయింది. అసలు 3200 ఇచ్చారు. మళ్లీ వడ్డీతో కలిసి ఇవాల్టికి రూ.50 వేలు దాటాయి. ప్రభుత్వం చెప్పినట్లు రూ.87వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి సంవత్సరానికి రూ.3 వేల కోట్లు ఇస్తే వడ్డీకి కూడా సరిపోవడం లేదు " అంటూ జ‌గ‌న్ లెక్క‌ల ఆధారంగా వివ‌రించారు. ఈ క్రమంలో స్పీకర్‌ మరోమారు మైక్‌ కట్‌ చేయడంతో వైఎస్‌ ఆర్‌ సీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద నిరసన తెలిపారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కాల్వ శ్రీనివాసులు, కళా వెంకట్రావ్‌ కు మైక్ ఇవ్వ‌డంతో వారు విమ‌ర్శ‌లు చేశారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించి ప్ర‌భుత్వం చెప్పిన డేటా ప్రకారం రూ.8 వేల కోట్లు అవుతుందని చెప్పారు. సభలో అసత్యాలు చెప్పడం ధర్మమేనా? ప్రభుత్వ తీరు వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఈ మూడేళ్లలో రూ.48 వేల కోట్లు వడ్డీ కట్టారని తెలిపారు. ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఇవ్వకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రుణాలు మాఫీ చేయకపోవడంతోనే రైతులు మృత్యువాత పడుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు అందడం లేదని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాగా, రైతుల ఆత్మహత్యలపై వైయస్‌ జగన్‌ మాట్లాడుతుండగా స్పీకర్‌ మూడు సార్లు మైక్‌ కట్‌ చేశారు. రైతుల ఆత్మహత్యలు- ఇన్‌ పుట్‌ సబ్సిడీ వంటి అంశాలపై వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయడంతో సమాధానం చెప్పలేక ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్ష సభ్యులు నిరసన చేపట్టగా స్పీకర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నార‌ని మండిప‌డ్డారు. వైఎస్‌ జగన్‌ కు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తీవ్ర నిరసనల మధ్య స్పీకర్‌ సభను మరోమారు వాయిదా వేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/