Begin typing your search above and press return to search.
అచ్చెన్నాయుడిలో కొత్త యాంగిల్ చూపించిన జగన్!
By: Tupaki Desk | 23 Dec 2018 5:04 AM GMTఈ రోజు ఏపీకి సంబంధించి ఏ అంశమైనా నాన్ స్టాప్ గా మాట్లాడే సత్తా ఉన్న నేత ఎవరంటే.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చెప్పాలి. నిర్విరామంగా ఆయన చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో సాగుతోంది. కడప జిల్లా నుంచి మొదలైన ఆయన పాదయాత్ర మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ప్రతి జిల్లాలో విస్తృతంగా పర్యటించటమే కాదు.. అక్కడి స్థానిక సమస్యలపై జగన్ సాధించిన పట్టు అంతా ఇంతా కాదు.
తాజాగా ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చెన్నాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అచ్చెన్నాయుడి అవినీతి లెక్కలు చెప్పిన జగన్ మాటలు వింటే అవాక్కు అవ్వాల్సిందే. అచ్చెన్నలో కొత్త యాంగిల్ చూపించిన జగన్.. ఈ సందర్భంగా ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అచ్చెన్నాయుడి గురించి తన వద్దకు వచ్చిన వారు చెప్పిన మాటల్ని చెప్పిన జగన్ వ్యాఖ్యల్ని యథాతధంగా చూస్తే..
+ మంత్రి అచ్చెన్నాయుడు తాటి చెట్టంత ఎదిగినా, ప్రజలకు ఈత గింజంత మేలు కూడా చేయలేదని శ్రీకాకుళం ప్రజలు చెబుతున్నారు.
+ ఈ ప్రాంతంలో ప్రతి పనికీ లంచం గుంజుతున్నారని ప్రజలు దారిపొడవునా చెబుతున్నారు. తాటి చెట్టంత మంత్రి ఈతకాయంత మేలు కూడా ప్రజలకు చేయలేదంటున్నారు.
+ చంద్రబాబునాయుడి కొలువులో ఇక్కడి నుంచి ఎన్నుకోబడిన మంత్రి అవినీతి విశ్వస్వరూపం. ఆయనకు ఈపేరు కూడా ఇక్కడి నుంచే వచ్చిందని చెబుతుంటారు. మా మంత్రి తాటి చెట్టంత ఎత్తయితే ఎదిగాడు కానీ ప్రజలకు మాత్రం ఈత కాయంత మేలైనా చేయలేదన్నా అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ మంత్రి అచ్చెన్నాయుడు. ఈయన గురించి రకరకాలుగా చెప్పుకొస్తున్నారు.
+ ఆముదాలవలస, నరసన్నపేట, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో జరిగే ఇసుక దందాలన్నింటికీ మా మంత్రి అచ్చెన్నాయుడే బిగ్‌బాస్ అని అంటున్నారు. ఇక్కడి నుంచి లంచాలు చినబాబు, పెదబాబుకు చేరవేస్తుంటాడన్నా అని చెబుతున్నారు.
+ ఈ నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టు పని జరిగినా ఆ చేసే వ్యక్తి సాక్షాత్తు అచ్చెన్నాయుడి తమ్ముడు హరిప్రసాద్ మాత్రమే కనిపిస్తాడని చెబుతున్నారు. నీరు–చెట్టు అవినీతి గురించి చెబుతూ సీతా సాగరం, దిమిలాడ చెరువులు దీనికి ఉదాహరణ అని చెబుతున్నారు. ఇక్కడే ఎకరా రూ.5 కోట్లు విలువ చేసే 3 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని ఏకంగా తన బినామీలకు మంత్రి తక్కువ ధరకు ఇప్పించారన్నా అంటున్నారు.
+ వివిధ కార్పొరేషన్‌ల ద్వారా వచ్చే డబ్బులకు కూడా కమీషన్ల కోసం కక్కుర్తి పడే మంత్రి ఎవరైనా ఉంటారా.. అంటే అది మా మంత్రే అని చెప్పుకొస్తున్నారు. చివరకు మరుగుదొడ్ల మంజూరుకు కూడా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు లంచాలు ఇచ్చుకోవలసిన అధ్వాన పరిస్థితి.
+ వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారన్న కారణంతో కోటబొమ్మాళి మండలం ఎలమంచిలి సహా ఏకంగా 1,500 మంది పెన్షన్లు కట్‌చేస్తే వారు కోర్టులకు వెళ్లి న్యాయం పొందిన పరిస్థితి ఇక్కడే కనిపిస్తోంది. 26 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన సర్పంచుల చెక్‌పవర్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే అచ్చెన్న రద్దు చేశారు.
+ ఈ పెద్దమనిషి మంత్రి అవుతూనే చాకిపల్లిలో దళిత మíహిళ చిన్న కిరాణాకొట్టు నడుపుకొంటూ బతుకుతుంటే ఆమెపై కూడా కక్ష కట్టి బుల్డోజరుతో కొట్టును తొలగించారన్నా.. అని చెబుతున్నారు. అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో ఏకంగా 20 కుటుంబాలను సాంఘిక బహిష్కరణకు గురిచేశాడన్నా ఈ సిగ్గుమాలిన మంత్రి అని చెబుతున్నారు.
+ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి గొడౌన్లు కట్టుకున్నారని, అందులో తరుగు పేరిట బస్తాకు రెండు కేజీలు చొప్పున ఏడాదికి రూ.3 కోట్ల విలువైన బియ్యం స్వాహా చేస్తున్నారని చెబుతున్నారు.