Begin typing your search above and press return to search.
జగన్ మంచి చురక వేశాడే
By: Tupaki Desk | 20 Nov 2017 5:00 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజాసంకల్పయాత్ర పేరిట నిర్వహిస్తున్న పాదయాత్ర పన్నెండో రోజున (ఆదివారం) కర్నూలు జిల్లా బనగానపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు ఘనస్వాగతం పలికారు.
జగన్ ను చూసేందుకు భారీ జనసందోహం పోటెత్తింది. తాను చేస్తున్న పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని అడిగిన జగన్.. బాబు పాలనపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు.. మోసాలు చేస్తున్నారని.. నాలుగేళ్లలో ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.
ఇవాళ ఏం చేస్తున్నావో చెప్పవయ్యా పెద్దమనిషీ అంటే 2050లో అది చేస్తా.. ఇది చేస్తానని ఊదరగొడుతున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు పడుతున్న కష్టాల్ని చూడలేక పాదయాత్రతో సమరశంఖం పూరించినట్లుగా చెప్పారు. ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని.. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి కానీ ఊరికి కానీ ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు. బాబు పాలనలో ఏ ఒక్కరికీ ఎలాంటి మంచి జరగలేదన్నారు.
2029 నాటికి ప్రపంచంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తానని చెబుతున్నారు. అప్పుల్లోనూ.. అవినీతిలోనూ.. అబద్ధాలతోనూ నెంబర్ వన్ చేశారంటూ మండిపడ్డారు.
చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానన్న జగన్.. నాలుగేళ్ల బాబు పాలనలో ఏమీ జరగలేదన్నారు. 2022 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తానని.. 2029 నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ చేస్తానని చెస్తానని బాబు చెబుతున్నారన్నారు. మీ ఊరు సర్పంచ్ 2022 నాటికి వాటర్ ట్యాంక్ కట్టిస్తా. 2029 నాటికి రోడ్డు వేయిస్తానంటే మీరు ఏమంటారు? మెంటల్ కేసు అంటారు కదా? ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో మాట్లాడుతున్నారు. నోరు తెరిస్తే 2022.. 2029 అంటూ ఏదో చెబుతున్నారని మండిపడ్డారు.
అవినీతిలో దేశంలోనే నెంబరు వన్ చేశారని.. అబద్ధాలు ఆడటంలో నెంబర్ వన్ చేశారని.. మద్యం అమ్మకాలు.. ఫీజు రీయింబర్స్ మెంట్ ఎగ్గొట్టటంలోనూ.. ఫీజులు పెంచటంలోనూ నెంబరు వన్ చేసినట్లుగా జగన్ ధ్వజమెత్తారు.