Begin typing your search above and press return to search.
హోదా కోసం ప్రాణం పోయినా..పట్టించుకోరా?
By: Tupaki Desk | 17 Jan 2018 5:36 PM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరిపై వైసీపీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగం చేసిన మునికోటి కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా తమ బాధలను వైఎస్ జగన్ కు వివరించారు. తమకు ఇల్లు గడవం లేదని - సర్కార్ నుంచి రూపాయి కూడా సాయం అందలేదు. మునికోటి చనిపోయినప్పుడు అప్పటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి - ఎమ్మెల్యే సుగుణమ్మ వచ్చి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేవలం మీరు మాత్రమే రూ. 3లక్షల ఆర్థికసాయం చేశారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మునికోటి కుటుంబ సభ్యులు తెలిపారు.
అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ బాధిత కుటుంబాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలను ప్రభుత్వం విస్మరించడం పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అమాయక యువకులు ప్రాణత్యాగం చేస్తే వారి కుటుంబాలను పట్టించుకోరా అని మండిపడ్డారు. విభజన చట్టంలోని ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వకపోవడంతో పదుల సంఖ్యలో యువత ఆత్మత్యాగాలు చేశారని తెలిపారు. అయితే ఆ కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు.
చనిపోయిన సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం చేస్తామన్న చంద్రబాబు సర్కార్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో చేతికందిన కొడుకులను కోల్పొయిన కుటుంబాలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని వారికి భరోసా కల్పించారు. వైఎస్ జగన్ హామీతో మునికోటి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.