Begin typing your search above and press return to search.
నాన్న ఆ పని చేయలేదేం జగన్?
By: Tupaki Desk | 15 Sep 2015 2:50 PM GMTవిపక్షంలో ఉంటే చాలు.. కనిపించిన ప్రతి ఒక్కరికి హామీల మీద హామీలు.. వరాల మీద వరాలు ఇచ్చేయటం మామూలే. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంగతే తీసుకుంటే.. ఆయన ఎక్కడ ప్రసంగం చేసినా 40 నిమిషాలకు తగ్గకుండా మాట్లాడేవారు. ఆయన ప్రసంగంలో వరాల మీద వరాలు ఇచ్చేవారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పేరు.. పేరునా.. ఒక్కో వర్గానికి ఒక్కో వరం.. కొంతమందికి రెండు.. మూడేసి వరాలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుది.
నాడు చంద్రబాబు వ్యవహరించిన ధోరణిలోనే జగన్ నడుస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో రుణమాఫీ విషయం సాధ్యం కాదని బల్లగుద్ది చెప్పిన ఆయన.. ఇప్పుడు మాత్రం ఎవరేం అడిగినా వరాలు ఇచ్చేస్తున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సభలో ఆయన మాట్లాడారు. ఈ సంద్భంగా ఆయన ఇచ్చిన వరాల్లో అత్యంత ముఖ్యమైంది.. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయటం.
చంద్రబాబు పాలన గురించి విమర్శలు చేసిన జగన్.. రానున్న రోజుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తామని.. పోరాటం చేస్తామని ప్రకటించారు. తన తండ్రి హయాంలో ఆర్టీసీకి చేసిన పనుల గురించి చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అప్పుడు ప్రభుత్వంలోకి ఆర్టీసీని విలీనం చేసేస్తానని చెప్పుకొచ్చారు. జగన్ మాటలు విన్నప్పుడు ఒక మాట అడగాలని మనసు మరీ ఇదిగా గొడవ పెట్టేస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెబుతున్న జగన్.. మరి.. ఆర్టీసీకి ఎంతో చేశారని చెప్పిన ఆయన తండ్రిగారు ఎందుకా పని చేయలేదు. ఆరేళ్లు పదవిలో ఉన్న వ్యక్తి.. అందునా వైఎస్ లాంటి మహానేత తలుచుకుంటే సాధ్యం కాకుండా ఉంటుందా? అదేమీ ఎందుకు చేయనట్లు జగన్..?