Begin typing your search above and press return to search.

బాబును జగన్ ఏ రేంజ్ లో వేసుకున్నారంటే.. 2

By:  Tupaki Desk   |   9 March 2016 9:51 AM GMT
బాబును జగన్ ఏ రేంజ్ లో వేసుకున్నారంటే.. 2
X
= రాజధాని లేదు కాబట్టి అవసరమైతే అటవీభూములను డీనోటిఫై చేస్తామన్నారు. ఇదే గుంటూరు జిల్లా వినుకొండలో 22వేల ఎకరాల అటవీభూమి ఉన్నా అది అవసరం లేదని అంటారు. ఆయనకు తన బినామీల కోసం ల్యాండ్ పూలింగే ముద్దు అంటారు. కేంద్రం వనరులిచ్చి, చేయమంటే.. చేయమని చంద్రబాబు చెబుతారు. సింగపూర్‌ తోను - చైనాతోను చేయిస్తామంటారు.

= ఏ దేశం పోతే ఆ దేశంతో చేయిస్తామంటారు. రెండేళ్లు అయిపోయింది, ఇప్పటికీ అక్కడ ఒక ఇటుక కూడా పడలేదు. పెద్ద పెద్ద ఫొటోలు చూపించి, అందులో పెద్ద బిల్డింగులు చూపిస్తారు.. ఆ బిల్డింగుల్లోనే చూసుకోవాల్సి వస్తోంది.

= రైల్వే జోన్ - పెట్రో కెమికల్ కాంప్లెక్సు - కడపలో స్టీల్ ప్లాంటు పెడతామన్నారు. ఇప్పటికి మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఎక్కడా ఈ మూడింటి ప్రస్తావనే లేదు. కానీ చంద్రబాబు మాత్రం ఈ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అదిగో జోన్ అంటారు, ఇదిగో కాంప్లెక్స్ అంటారు, అదిగో ప్లాంటు అంటారు. ఈ హామీలలో ఏ ఒక్కటైనా చంద్రబాబు సంతృప్తి కలగజేసేలా తేగలిగారా? ఎందుకు ఆయన చిత్తశుద్ధి - సిన్సియారిటీ చూపించడంలేదు, కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు? కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారు? మీరు నెలరోజుల్లోగా చేయలేకపోతే.. మా కేంద్ర మంత్రులను ఉపసంహరించుకుంటాం అని ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారు?

= చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే బాధ అనిపిస్తుంది. ఆయనకు సిన్సియారిటీ, చిత్తశుద్ధి కనిపించడం లేదు. కేంద్ర మంత్రులకు వేరే రకమైన పిక్చర్ ఇస్తారు, ప్రపంచానికి వేరే రకంగా పిక్చర్ ఇస్తారు. చంద్రబాబు సిన్సియారిటీని ఎందుకు శంకించాల్సి వస్తోందంటే, ఆయన ప్రవర్తిస్తున్న తీరు అలా ఉంది.

= రాష్ట్రంలో విశాఖపట్నంలో రెండు రోజుల పెట్టుబడి సదస్సు పెట్టారు. దానికి అరుణ్ జైట్లీ దగ్గర నుంచి అరడజను మంది కేంద్రమంత్రులను పిలిచారు. దానికి పెద్దగా పబ్లిసిటీ చేసుకున్నారు. రెండు రోజుల్లో రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, ఎంఓయూలు సైన్ చేశామని గొప్పలు చెప్పుకొన్నారు. తాను చైనా - దావోస్ తిరిగి వచ్చాను కాబట్టి తన వ్యక్తిగత చరిష్మావల్లే ఇవన్నీ వచ్చాయని చెప్పుకొన్నారు.

= 48 గంటల్లోనే చంద్రబాబు అన్ని పెట్టుబడులు తెచ్చారు.. ఇలాంటి రాష్ట్రానికి మనం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదని కేంద్ర మంత్రులు అనుకోరా? 1994.. 2004 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా ఇలాగే ప్రతియేటా స్విట్జర్లాండ్ - సింగపూర్ వెళ్లేవారు, ఇన్వెస్టర్ మీట్లు పెట్టేవారు. ఆ తొమ్మిదేళ్లలో వెయ్యి కోట్ల పైబడి పెట్టుబడులతో ఎన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు తెచ్చారని అడుగుతున్నా? ఎన్నివేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారని అడుగుతున్నా?

= ఏ ప్రభుత్వమైనా ఎలా పనిచేసిందనడానికి కొలబద్దలు ఉంటాయి. ఆయన చెప్పిన ఐదేళ్లలో ఫిగర్లు ఒకసారి చూద్దాం. 1999 నుంచి 2004 వరకు వ్యవసాయంలో సాధించిన పెరుగుదల 2.89 శాతం. పరిశ్రమల రంగంలో సాధించింది 5.20 శాతం పెరుగుదల. సేవల రంగంలో సాధించిన పెరుగుదల 7.7 శాతం.

= ఆ తర్వాత 2009 వరకు రాజశేఖరరెడ్డి పాలన సాగింది. ఆయన దావోస్ వెళ్లలేదు.. గొప్పలు చెప్పుకోలేదు. వ్యవసాయం 6.41 శాతం పెరుగుదల వచ్చింది. పరిశ్రమల రంగంలో 10.91 శాతం పెరుగుదల వచ్చింది. సేవా రంగంలో 10.6 శాతం పెరుగుదల వచ్చింది. రాష్ట్రానికి సంబంధించి జీఎస్‌ డీపీ గ్రోత్‌ రేటు 9.56 శాతం వచ్చింది.

= ఇవన్నీ చెప్పడానికి బలమైన కారణం ఉంది. హీరో మోటార్ కార్పొరేషన్ కోసం వాళ్లు ఫ్యాక్టరీ పెడతామంటే వాళ్లతో చంద్రబాబు ఉన్నారు. ఏషియన్ పెయింట్స్ ఫ్యాక్టరీ కోసం వచ్చినప్పుడూ వాళ్లతో చంద్రబాబు ఉన్నారు. వీళ్లిద్దరూ ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డితో కూడా ఇలాగే ఫొటోలు దిగారు. చంద్రబాబు సీఎం అయ్యి రెండేళ్లయిన తర్వాత.. ఇప్పుడు ఈ రెండు సంస్థల పెట్టుబడులు ఏమయ్యాయని అడుగుతున్నా. విశాఖపట్నంలో ఒక్క ఐటీ కంపెనీ అయినా తీసుకురాగలిగారా అని అడుగుతున్నా.