Begin typing your search above and press return to search.
బాబు ఏం మర్చిపోయాడో చెప్పిన జగన్
By: Tupaki Desk | 16 March 2017 5:44 PM GMTఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా - పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ అధినేత - ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానంపై ప్రసంగించడంతో పాటు అసెంబ్లీ ముగిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు శాసనసభ జరిగిన తీరు కౌరవ సభను తలపించిందని జగన్ పేర్కొన్నారు. కడపను కూడా కౌరవ సభగా మార్చేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.
ఈ రోజు సభలో పోలవరంపై చంద్రబాబు మాట్లాడిన మాటలు చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు స్వప్నం అన్నట్లుగా కనిపిస్తోందని జగన్ ఎద్దేవా చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం మూడేళ్ల తరువాత కూడా ఇంత వరకూ కేవలం 3వేల కోట్లే వ్యయం చేశానని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కల అని జగన్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతోనే పోలవరం కల సాకారమవుతుందని పేర్కొన్నారు. ఇంతకు ముందు 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. పోలవరానికి ఇప్పటి వరకు రూ. 8800 కోట్లు ఖర్చు చేస్తే.. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకముందే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రూ.5540 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. వైయస్ ఆర్ హయాంలో 180 కిలో మీటర్ల రైట్ కెనాల్ - 135 కిలోమీటర్ల లెప్ట్ కెనాల్ పూర్తి చేశారని తెలిపారు.. చంద్రబాబు సీఎం అయ్యాక, ఈ మూడేళ్ల కాలంలో టీడీపీ ఖర్చు చేసింది కేవలం రూ.3300 కోట్లు అని చెప్పుకోవడం సిగ్గుచేటని జగన్ అన్నారు. టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కాంట్రాక్ట్ ఉపసంహరించుకుందన్నారు. టీడీపీ మద్దతిచ్చి తెలుగు కాంగ్రెస్ సర్కార్‌ను చంద్రబాబు దగ్గరుండి కాపాడాడని విమర్శించారు. బ్లాక్ లిస్ట్ లో ఉన్న ట్రాన్స్ రాయ్ అనే కంపెనీని తీసేయకుండా కొనసాగించారని జగన్ ధ్వజమెత్తారు. నామినేషన్ పద్ధతిలో పనులు చేసుకొని దోచుకున్నారని, మంత్రి యనమల బంధువులకు పనులు అప్పగించారని వ్యాఖ్యానించారు. ఆ రోజుకు, ఈ రోజుకు సిమెంట్, ఇసుక, డీజిల్ ధరలు తగ్గినా కూడా అంచనాలు పెంచి కమీషన్లు తీసుకున్నారని జగన్ మండిపడ్డారు.
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమెదంపై అసంబ్లీలో ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. ఇదే అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోరుతూ రెండుసార్లు చేసిన తీర్మానాల సంగతేమిటని జగన్ సూటిగా ప్రశ్నించారు. మోడీ పక్కన ఉండగానే ఏపీకి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర అభివృద్ధి జరగదని చెప్పిన చంద్రబాబు మరచిపోయారా అని ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందని చంద్రబాబు గోబెల్స్ ప్రచారానికి తెర లేపారని వైఎస్ జగన్ మండిపడ్డారు. అబిజిత్సింగ్ అనే ఆర్థిక సంఘం సభ్యుడు రాతపూర్వకంగా లేఖ ఇచ్చారు. ఇది చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 31, ఆగస్టు 2015లో, మార్చి 2016లో ఇదే అసెంబ్లీలో రెండుసార్లు చంద్రబాబు తీర్మానాలు చేయించారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని నిలదీశారు. ఇదే చంద్రబాబు హోదా వస్తే ఏముందని అంటున్నారు. మోడీని పక్కన పెట్టుకొని చంద్రబాబు ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని అన్నారు. ఈ విషయం మరిచిపోతే ఎలా? అలాగే కేబినెట్ తీర్మానంలో ప్రత్యేక హోదా ఇవ్వండి అని తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత, నీతి అయోగ్ ఏర్పడకముందు కూడా వీళ్లు పట్టించుకున్న పాపాన పోలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 2 గురించి బాబు ఏదేదో చెప్పారు. ఆ రోజు హోదా ఇవ్వండి అని కేబినెట్లో తీర్మానం చేసిన తరువాత ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించడం లేదన్నారు. ముంపు మండలాలు ఏపీలో కలిపేందుకు చంద్రబాబు చాలా కృషి చేసినట్లు చెబుతున్నారని ఇది అసత్య ప్రచారమని జగన్ ఖండించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/